Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Warangal Congress

Off The Record : వరంగల్‌ కాంగ్రెస్‌ లో మంత్రులను సైతం ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదా? ఎందుకు?

Published Date :April 15, 2025 , 7:54 pm
By Gogikar Sai Krishna
Off The Record : వరంగల్‌ కాంగ్రెస్‌ లో మంత్రులను సైతం ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదా? ఎందుకు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అక్కడ ఎమ్మెల్యేలంతా…………. మంత్రులా, అయితే ఏంటని అంటున్నారా? జానేదేవ్‌, వాళ్ళదారి వాళ్ళది, మా దారి మాదని అంటూ ఏకంగా చేతల్లోనే చూపిస్తున్నారా? అంతా దరిదాపుల్లో ఉన్నాసరే… కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేనంత గ్యాప్‌ పెరిగిపోయిందా? ఎక్కడుందా దారుణమైన పరిస్థితి? ఎవరా ఇద్దరు మంత్రులు? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో ఎవరి గోల వారిదే అన్నట్టుగా మారుతోంది. మరీ ముఖ్యంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అస్సలు పొసగడం లేదంటున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే… కాంగ్రెస్‌లో ఐక్యత అన్నది భ్రమేనని తేలిపోతోందంటున్నారు పరిశీలకులు. మంత్రులు, ఎమ్మెల్యేలు నాలుగైదు కిలోమీటర్ల పరిధిలోనే తిరుగుతున్నా…. ఎవరి కార్యక్రమాలు వారివే అన్నట్టుగా నిర్వహిస్తున్నారట. వారం రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పాల్గొంటున్న నాయకుల తీరు చూస్తుంటే….అసలు వీళ్ళంతా ఒకే పార్టీలోనే ఉన్నారా? అన్న అనుమానం కలుగుతోందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. జిల్లాకు మంత్రి అయినా…. అంబేద్కర్ జయంతి వేడుకల్లో కొండా సురేఖ కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. అధికారికంగా అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన వేడుకలకు వెళ్ళలేదు. ఎమ్మెల్యేలంతా పాల్గొన్న ఆ ప్రోగ్రామ్‌కు మంత్రి వెళ్ళకపోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఇక అంతకుముందు శుక్రవారం జరిగిన బాబూ జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో కూడా ఇలాగే గ్యాప్‌ కనిపించింది. ఇక నగరంలో నిర్వహించిన తూర్పు నియోజకవర్గ స్థాయి జాబ్ మేళాలో మంత్రులు సురేఖ, సీతక్క పాల్గొన్నారు.

కానీ… ఆ వేదికకు కిలోమీటర్ పరిధిలోనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిర్వహించిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు వెళ్ళలేదు. అధికారిక కార్యక్రమం అయినా సరే… అలా ఎందుకు జరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంతా. మంత్రులకు ఆహ్వానం లేదా? లేక పిలిచినా వెళ్లలేదా? అని ఆరాలు తీస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్యలాంటి చాలా మంది నాయకులు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైతే… సమీపంలోనే ఉండి కూడా మంత్రులు ఇద్దరూ అటువైపు తొంగి చూడకపోవడం ఏంటన్నది ప్రస్తుతానికి క్వశ్చన్‌ మార్క్‌గా మిగిలింది. అంతేకాదు….పాలిటెక్నిక్ కాలేజీ భవనాల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న ప్రాంతాన్ని దాటుకుంటూనే వెళ్ళి కొండా సురేఖ నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో పాల్గొన్నారు మరో మంత్రి సీతక్క. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒకే చోట ఉండి కూడా.. ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించటం ఏంటన్నది అంతు చిక్కడం లేదంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. అసలేంటీ గోల? ఎందుకీ గ్యాప్‌ అని ఆరా తీస్తున్న వారికి ఇప్పుడిప్పుడే కొత్త విషయాలు తెలుస్తున్నాయట. మంత్రి సీతక్క మీద ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆమె హనుమకొండ కలెక్టరేట్‌లో తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌కు నర్సంపేట, వరంగల్‌ పశ్చిమ, మహబూబాబాద్‌, పాలకుర్తి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో వరంగల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేదన్న గుసగుసలు గుప్పుమంటున్నాయి. మొన్నటి వరకు సీతక్క, సురేఖల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి ఈ ఇద్దరు మంత్రులు తెర దించే ప్రయత్నం చేశారు.

మినీ మేడారం జాతరలో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న మేడారం ప్రాంతంలో జరిగిన కార్యక్రమానికి సురేఖ హాజరైతే తాజాగా సురేఖ ప్రాతినిధ్య వాయిస్తున్న ఈస్ట్ నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళాకు సీతక్క వెళ్ళి ఐక్యతారాగం పలికారు. బస్‌…. అది అక్కడి వరకే. కేవలం మంత్రులు మాత్రమే మా మధ్య గ్యాప్‌ లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారుగానీ…. ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలను దాచలేకపోయారన్న టాక్‌ నడుస్తోంది జిల్లాలో. దీని ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై తీవ్రంగా పడుతుందనే చర్చ నడుస్తోంది ప్రస్తుతం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు క్యాడర్‌కి నామినేటెడ్ పదవులు లేవు. నేతల మధ్య సఖ్యత లేకపోవడమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు. ఒకరు సూచించిన పేరును మరొకరు వ్యతిరేకిస్తుండటంతో… నామినేటెడ్ పోస్టులు క్యాడర్‌ని ఊరిస్తున్నాయే తప్పచేతికి అందటం లేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విభేదాలకు ఎక్కడ ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ntv
  • OTR
  • Warangal Congress

తాజావార్తలు

  • US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..

  • KL Rahul: సూపర్ రివెంజ్.. KL రాహుల్ గోల్డెన్ డక్‌పై LSG స్టెయిర్‌కేస్ ట్రోల్.. DC గెలుపుతో బ్యాక్ ట్రోల్!

  • US-Iran War: హార్ముజ్ తెరిస్తే కాల్పుల విరమణ.. యూఎస్-ఇరాన్ చర్చలు..!

  • Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions