Site icon NTV Telugu

Telangana BJP : అభయ్ పాటిల్ కు బీజేపీ హైకమాండ్ ఫుల్ క్లారిటీ..?

Bjp

Bjp

తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్‌ విషయంలో క్లారిటీ వచ్చినట్టేనా? ఆ విషయంలో ఇన్నాళ్ళుగా ఉన్న సన్నాయి నొక్కుళ్ళకు తెరపడినట్టేనా? అభయ్‌ పాటిల్‌ విషయంలో అసలు వివాదం ఎక్కడుంది? ఆయనంటే తెలంగాణ బీజేపీ లీడర్స్‌ ఎందుకు భయపడుతున్నారు? పాటిల్‌ తనదైన శైలిలో పనిచేయగలరా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొన్ని నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జ్‌గా వచ్చారు కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్. ఆ తర్వాత ఆయన్నే… రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌గా పూర్తి స్థాయిలో నియమించింది పార్టీ హైకమాండ్‌. కానీ… ఆ విషయాన్ని లాంఛనంగా ప్రకటించలేదు. నేషనల్ పార్టీ వెబ్ సైట్‌లో మాత్రం తెలంగాణ ఇన్ఛార్జ్‌ అని మెన్షన్ చేసింది. అలాగే ఆయన కూడా… ఢిల్లీ ఆఫీస్‌ మీటింగ్స్‌కు ఇదే హోదాలో హాజరవుతున్నారు. అయినాసరే… రాష్ట్ర నాయకుల్లో మాత్రం ఎందుకో తెలియదుగానీ… ఏదో గందరగోళం. పాటిల్‌కు పూర్తి బాధ్యతలు ఇవ్వలేదు, అయన రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్‌ కాదు, కేవలం మెంబర్ షిప్‌కు మాత్రమేనంటూ రకరకాలుగా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నారు. విచిత్రంగా కొందరు పార్టీ సీనియర్‌ లీడర్స్‌ సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారట. ఆయన అయన రాఫ్ట్రానికి వచ్చినా… ఇన్చార్జ్‌ అని చెప్పడానికి ఇష్టపడేవారు కాదు. ఇటీవల నడ్డాతో జరిగిన మీటింగ్‌లో కూడా స్టేట్ ఇన్చార్జ్‌ హోదాలోనే పాల్గొన్నారు అభయ్‌. కానీ… రాష్ర్ట పార్టీ పెట్టే టెలి కాన్ఫరెన్స్ లో మాత్రం ఆయన్ను యాడ్ చేయడం లేదు. రాష్ర్ట స్థాయి మీటింగ్స్‌కు పిలవడం లేదు. దీంతో…. మండిపోయిన పాటిల్‌… ఏంటీ ఎక్స్‌ట్రా వేషాలు, పోనీలే అని చూస్తూ ఊరుకుంటుంటే… మరీ వోవర్ చేస్తున్నారంటూ ఫైరైపోయారట. అసలిది పద్ధతేనా? నేను తెలంగాణ ఇన్ఛార్జ్‌నా? కాదా? ఏదో ఒకటి తేల్చి చెప్పేయమని ఢిల్లీ పెద్దల్ని దాదాపు నిలదీసినంత పని చేసినట్టు సమాచారం. అందుకు రియాక్షన్‌గా కేంద్ర పార్టీ పెద్దలు అబ్బే… అలాంటిదేం లేదు. స్టేట్‌ ఇన్ఛార్జ్‌ మీరే… కాదన్నదెవరు అంటూ ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసినట్టు సమాచారం.

అదే సందేశం అధికారికంగా రాష్ట్ర పార్టీకి రావడంతో… ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలంతా ఆయన్ను ఆ పదవిలోనే గుర్తిస్తున్నారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా తాజాగా పాటిల్‌ను రాష్ర్ట ఇన్చార్జ్‌గానే పరిచయం చేశారు. దీంతో ఇక…ఈ ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ పడ్డట్టేనని, వివాదం ఖతమైనట్టేనని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు. అసలింతకీ మేటర్‌ ఏంటి? ఇన్ని రోజులు ఎందుకు డ్రామా నడిచిందయ్యా అంటే… మేటర్‌ వేరే ఉందట. అభయ్ పాటిల్ అంటే తెలంగాణ బీజేపీ నేతలకు ఒకింత భయం ఉందని చెప్పుకుంటున్నారు. ఆయన ఇన్ఛార్జ్‌ అయితే… తమ ఆటలు సాగవన్న అభిప్రాయం కూడా ఓ వర్గానికి ఉందట. ముక్కుసూటి తనం, అవతల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా… పార్టీ లైన్‌లో చెప్పాలనుకున్నది ముఖం మీదే చెప్పేయడం లాంటి లక్షణాల కారణంగా… కొందరు బడా నేతలు ఆయనంటే అసహనంగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఇన్ని రోజులు కితకితలు నడిచాయంటున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు అధిష్టానం స్పష్టంగా చెప్పేయడంతో… సదరు సీనియర్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అటు అభయ్ పాటిల్ కూడా రంగంలోకి దిగి జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు. ఇక నుంచి రెగ్యులర్‌గా తెలంగాణకు వస్తానని ప్రకటించారు. కానీ… ఎడ మొహం పెడ మొహంగా ఉండే పార్టీ పెద్ద తలకాయలను ఒక తాటి పైకి తీసుకురావడం మాత్రం ఆయనకు సవాలేనంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. శ్రేణులకు భరోసా నింపి వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా నడిపించడం కత్తిమీద సామేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ మనిషిగా, రాజీపడని వ్యక్తిగా… అభయ్‌ పాటిల్‌ తెలంగాణ బీజేపీని ఎలా డీల్‌ చేస్తారోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.

 

Exit mobile version