NTV Telugu Site icon

Off The Record : అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది..?

Bjp Otr

Bjp Otr

ఆ పార్టీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియడం లేదా? బయటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి… కనీసం అందులోని ముఖ్య నాయకులనుకునే వాళ్ళకు సైతం వ్యవహారం బోధపడటం లేదా? ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… హై కమాండ్‌కు కరెక్ట్‌ ఫీడ్‌ బ్యాకే వెళ్ళడం లేదా? ముఖ్య నేతలంతా… వ్యక్తిగత ప్రయోజనాల కోణంలోనే ఢిల్లీ పెద్దలకు నివేదికలు ఇస్తున్నారా? ఏదా జాతీయ పార్టీ? ఏం జరుగుతోంది అందులో? తెలంగాణ కమలం పార్టీలో పైకి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరన్నట్టుగా ఉంటోందట. అనుకుంటున్నంత సజావుగా ఏం లేదన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌. టాప్‌ టు బాటమ్‌… అసలేం జరుగుతోందో.. ఎవ్వరికీ ఏం అర్ధం కావడం లేదంటున్నారు. ముఖ్య నేతలు ఎవరికి వారే యమునా తీరేగా వ్యవహరిస్తున్నారన్న అసహనం కేడర్‌ పెరిగిపోతోందట. పార్టీలో ఏం జరుగుతోందో… ఎక్కడ ఎలాంటి లోపాలున్నాయోలాంటి ముఖ్యమైన సమాచారం ఏదీ… అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే… ఢిల్లీ పెద్దలకు అందడం లేదన్నది లేటెస్ట్‌ టాపిక్‌. దానికి తోడు పరస్పరం ఫిర్యాదులు కూడా పెరిగిపోయాయంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ హై కమాండ్ ఏ రాష్ట్రానికి లేనంత మందిని ఇక్కడ ఇన్చార్జ్‌లుగా పెట్టింది… అయితే… వాళ్ళెవరూ పార్టీ ఇంట్రెస్ట్‌తో పని చేయలేదన్నది బీజేపీ వర్గాల ఆరోపణ. హై కమాండ్ కు రిపోర్ట్ ఇవ్వడంలో కానీ, ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ… అప్పజెప్పిన పనిని సక్రంగా చేయలేదని, దాని పర్యవసానమే ఇప్పుడంతా గందరగోళంగా తయారైందని అంటున్నారు. దానికి తోడు ఇన్ఛార్జ్‌లు వ్యక్తిగత ఇగోలకు పోయి తీసుకున్న నిర్ణయాలు నష్టం చేశాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట కేడర్‌లో.

అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఏం మారలేదని, ఢిల్లీ నాయకత్వానికి వాస్తవ పరిస్థితులు తెలియడం లేదన్నది కింది స్థాయిలో జరుగుతున్న చర్చ. తమకు అవసరం అయిన మేరకు మాత్రమే… విషయాలను పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారట ముఖ్య నేతలు. అందుకే… రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయంలో హై కమాండ్ ఒక క్లారిటీ రాలేకపోతోందని అంటున్నారు. అధ్యక్ష పదవి విషయంలో పార్టీ విస్తృత ప్రయోజనాల కోణంలో కాకుండా… ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పడం వల్లే సమస్య జఠిలం అవుతోందన్నది తెలంగాణ బీజేపీ నేకల ఇన్నర్‌ వాయిస్‌. సంఘ్ పరివార్‌ పెద్దలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్న మాటలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయట పార్టీ వర్గాలను. రాష్ర్ట అధ్యక్షుని విషయంలో వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన పేర్లు చెప్పారన్నది టాక్‌. సంఘ్‌ పెద్దలు సైతం పార్టీ ప్రయోజనాల కన్నా తమకు వ్యక్తిగతంగా ఎవరు కంఫర్ట్‌గా ఉంటారో చూసుకుని వాళ్ళ పేర్లే సిఫారసు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి బీజేపీ వర్గాల్లో. రాష్ట్ర పార్టీ అధ్యక్ష అంశంలో పాత, కొత్త పంచాయతీ కూడా నడుస్తోందంటున్నారు. ఆ క్రమంలో రిపోర్ట్‌లు…వాస్తవ పరిస్థితుల ఆధారంగా వెళ్ళడం లేదట. ప్రస్తుతం బీజేపీకి రాష్ట్ర ఇన్చార్జి కూడా లేడు… అందరినీ కలుపుకొని పోయే, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తికి ఇన్ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.
దీంతో హై కమాండ్ ఎలా ముందుకు వెళ్తుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి పార్టీ శ్రేణులు.

Show comments