NTV Telugu Site icon

Off The Record : బీఆర్‌ఎస్‌ అక్రమాలపై ఆ అధికారిని Congress రంగంలోకి దించుతుందా?

Akun Sabarwal Otr

Akun Sabarwal Otr

ఆ ఇద్దరు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారులు…తెలంగాణలో కలిసి పని చేయబోతున్నారా? నాటి ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన వారికి…కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందా ? బీఆర్ఎస్ నేతలు చేసిన అక్రమాలు, అనైతిక కార్యక్రమాలు బయటకు తీయడమే ప్రభుత్వ లక్ష్యమా? కేంద్రం నుంచి ఆ అధికారిని రాష్ట్రానికి తీసుకురావడం వెనుక ఉన్న కారణాలు ఏంటి ? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరించిన పలువురు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెన్ అధికారులను అప్రాధాన్య పోస్టులు కేటాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో అప్రాధాన్య శాఖలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక పదవులు దక్కాయి. అంతేగాక కొంతమందికి రెండు మూడు పోస్టులు కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మరో అధికారికి కీలక పదవి ఇవ్వనున్నట్లు బ్యూరోక్రాట్స్‌ సర్కిల్స్‌లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో త్వరలో ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కేంద్రంలో పని చేస్తున్న ఒకరిద్దరు ఐపీఎఎస్‌లను తెలంగాణకు రానున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీనియర్‌ ఐపీఎస్‌ అకున్‌ సభర్వాల్…గతంలో తెలంగాణ నుంచి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2019లో అకున్‌ సభర్వాల్‌ కేంద్రానికి వెళ్లారు. నాలుగేళ్లు సర్వీసు పూర్తి కావడంతో…సొంత కేడర్‌కు పంపాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ విషయంలో కేంద్రం కూడా ఎలాంటి తాత్సారం చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

అయితే అకున్ సభర్వాల్ తెలంగాణకు వచ్చిన తర్వాత…ప్రభుత్వం ఏ పోస్టు కేటాయిస్తుందన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది. సీనియర్‌ కావడంతో…కీలక శాఖను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సెక్రటేరియట్‌లో గుసగుసలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన సివిల్ సప్లై కమిషనర్‌గా, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పని చేసారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాల నిరోధానికి అడ్డు కట్టే వేసే పోస్టు ఇస్తారని మరికొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని…వారి వ్యవహారాన్ని బయటకు తీసేందుకు అకున్‌ లాంటి అధికారి అయితే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోందంట. పదేళ్ళుగా మాదక ద్రవ్యాల వాడకం, సరఫరాపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని… గులాబీ నేతలకు వాటితో సంబంధాలు ఉండటం వల్లే డ్రగ్స్ కేసు నీరుగార్చరని కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ కేసును తిరగ దోడాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతం అకున్‌ సభర్వాల్‌ భార్య స్మితా సభర్వాల్…రాష్ట్ర ప్రభుత్వంలోని ఫైనాన్స్ కమిషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెపై గతంలో కాంగ్రెస్ నేతలు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ఆమెకు లూప్‌లైన్‌లోనే పోస్టును కేటాయించారు. సీనియర్ ఐఏఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న స్మితాకు…గ్రూప్ 2 స్థాయి అధికారి నిర్వహించే పోస్టును కేటాయించారు. అయితే అకున్ సభర్వాల్, స్మితలలో ఒకరికి కీలక పోస్టింగ్ ఇచ్చి…మరొకరికి లూప్ లైన్ పోస్ట్‌తో ప్రభుత్వం సరిపెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కీలకంగా ఉన్న కొందరు బ్యూరోక్రాట్స్…ఇప్పుడు కూడా కీలక పోస్టింగ్స్‌లో కొనసాగుతున్నారు. వారి లాగే స్మితకు కూడా త్వరలో కీలక పోస్టింగ్ ఇచ్చి…భార్యభర్తలిద్దర్ని పని చేయిస్తుందా? ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా అన్నది తెలియాలంటే మరికొంత కాలంగా ఆగాల్సిందే.