Off The Record : Secunderabad Cantonmentలో కమలం అభ్యర్థి ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కమలం పార్టీ అభ్యర్థి ఎవరు? మిగతా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేసినా… బీజేపీ ఎందుకు ఇంకా వేచి చూస్తోంది? ఉప ఎన్నిక అభ్యర్థి విషయమై పార్టీకి ఉన్న లెక్కలేంటి? ఇక్కడ కూడా ఇంపోర్టెడ్ కల్చరే ఉంటుందా? లేక పార్టీ పాత నేతలకు అవకాశం ఇస్తారా? కంటోన్మెంట్ కేంద్రంగా కమలం పార్టీలో ఏం జరుగుతోంది? లోక్ సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ బరిలో ఉండబోతున్నారు. శ్రీ గణేష్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2018 లోనూ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారాయన. ఇక బీఆర్‌ఎస్ నుంచి లాస్య నందిత చెల్లెలు నివేదిత పోటీలో ఉండవచ్చంటున్నారు. అయితే బీజేపీ అభ్యర్థిత్వంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ రెండో స్థానం లో నిలిచింది. అయితే ఇప్పుడు అదే అభ్యర్థి కాంగ్రెస్ నుండి పోటీలో ఉండటం ఆసక్తిగా మారింది. దీంతో కమలం పార్టీ తరపున పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈసారి జంపింగ్ జపాంగ్‌లకు ఇవ్వవద్దన్న డిమాండ్ పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. కొత్త వారికి కాకుండా పాత వాళ్ళకే ఇవ్వాలని అంటున్నారు.
బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు భాషా టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో లాబీయింగ్ చేస్తున్నారట ఆయన. అలాగే మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు వంశీ తిలక్ కూడా టికెట్ ఆశిస్తున్నారట. మరోవైపు గత ఎన్నికల్లో సైతం సీటు ఆశించి గ్రౌండ్ వర్క్ చేసుకున్న మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత బీజేపీ టిక్కెట్ రేస్‌లో ఉన్నారు. మాజీ ఎంపీ వర్రి తులసీ రామ్ కుమారుడు విజయ్ కుమార్ ఆశావహుల లిస్ట్‌లో ఉన్నారు. ఆర్థిక కోణంలో చూస్తే విజయ్‌కుమార్ అవకాశం ఉండవచ్చంటున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ శాంరావు మనవడు సందీప్ సాయి కూడా లైన్‌లో ఉన్నారట. అలాగే… టికెట్ రాని ఓ మాజీ ఎంపీ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సెంటిమెంట్ ను నమ్ముకోగా , కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండో స్థానం లో నిల్చిన వ్యక్తికి పార్టీ కండువా కప్పి టికెట్ ఇచ్చింది… బీజేపీ అర్థ, అంగ బలం ఉన్న బలమైన నేత కోసం వెదుకుతోంది. దీంతో కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తిగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
-
Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!