NTV Telugu Site icon

Off The Record : పిఠాపురంలో తమ్ముళ్ల దూకుడుకు బ్రేక్..?

Pithapuram Otr

Pithapuram Otr

పిఠాపురంలో తమ్ముళ్ళ దూకుడుకు బ్రేకులు పడుతున్నాయా? హై ప్రొఫైల్‌ సెగ్మెంట్‌లో పదే పదే సమస్యలు రావడంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందా? పిన్‌ టు పిన్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ కోసం పెద్దలు ఆదేశించారా? యవ్వారం శృతిమించకుండా ఏం చేయాలనుకుంటోంది పార్టీ అధిష్టానం? ఓవర్‌ స్పీడ్‌ని కంట్రోల్‌ చేసే ప్లాన్స్‌ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి పెద్దల్లో ఒకరి ఓన్‌ సెగ్మెంట్‌ అయినా సరే…. ఇక్కడ మాత్రం టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ కేడర్‌, లీడర్స్‌ని పార్టీ పరంగా కంటే… నియోజకవర్గ నాయకుడు వర్మ వర్గంగానే చూస్తున్నారు జనసైనికులు. దీంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో వివాదాలు రేగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్సీ అయ్యాక తొలిసారి ఆ హోదాలో గతవారం నాగబాబు నియోజకవర్గంలో పర్యటించారు. సెంటిమెంట్‌గా ఫస్ట్‌ టైం తమ్ముడి నియోజకవర్గానికి వచ్చారట నాగబాబు. రెండు రోజులపాటు మూడు మండలాలు, మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లా పాల్గొన్నారాయన. ఆ కార్యక్రమాల్లోో కాస్త తేడాలు జరగడంతో… అసలేమైందని ఆరా తీస్తోందట టీడీపీ అధిష్టానం. నాగబాబు వెళ్లిన ప్రతీ కార్యక్రమంలోనూ జై వర్మ, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మోత మోగించారు తమ్ముళ్ళు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా రచ్చ చేశారు.
స్పాట్‌ విత్‌ స్లోగన్స్‌

ఈ ఎపిసోడ్‌తో పరిస్థితి శృతిమించుతోందని గమనించిన ప్రభుత్వ పెద్దలు అసలేం జరుగుతోందంటూ ఇంటెలిజెన్స్ నివేదిక అడిగినట్టు తెలిసింది. ముందు ఎవరు అడ్వాన్స్‌ అయ్యారు? ఎవరు రెచ్చ గొట్టారు? రెండు వర్గాల వెనకా, ముందూ ఉన్నవారివివరాలతోసహా.. పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్‌ ఇవ్వమని ఆదేశించారట. దాంతో పాటు పార్టీ వర్గాల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్టు సమాచారం. అసలు నాగబాబు టూర్‌లో అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముందన్న అంశం మీద ఫోకస్ చేశారట కూటమి పెద్దలు. ఆ పర్యటనకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ వర్మ దూరంగా ఉన్నారు. ఆరోజు నియోజకవర్గంలోనే ఉన్నాసరే… కనీసం అటువైపు తొంగి చూడలేదు. అసలు హై ఫోకస్ ఉన్న నియోజకవర్గంలో ప్రతిసారి ఏదో ఒక వివాదం రేగడం, దానివల్ల రెండు పార్టీల కేడర్‌ మధ్య మనస్పర్ధలు పెరగడం మంచిది కాదని భావిస్తున్నారట సైకిల్ పార్టీ పెద్దలు. అయితే… మొదట టిడిపి వైపు నుంచే కవ్వింపు చర్యలు మొదలయ్యాయన్న క్లారిటీ మాత్రం వచ్చినట్టు తెలిసింది. అలా ఎందుకని అంటే…. తమ్ముళ్ళ సమాధానం కూడా గట్టిగానే ఉందట. జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్‌కు రియాక్షనే మా యాక్షన్‌ అన్నట్టు తెలిసింది. పరోక్షంగా తమ నాయకుడు వర్మని ఉద్దేశించే అప్పుడు నాగబాబు ఖర్మ కామెంట్స్‌ చేశారని, అవి అర్ధంకానంత అమాయకులం కాదుకదా అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ పరిస్థితులు ఇలా లేవు కదా అని గుర్తు చేస్తున్నారట తమ్ముళ్ళు. వాళ్ళ యాక్షన్‌కి కచ్చితంగా మా రియాక్షన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేస్తున్నారట. అయితే… నాగబాబు టూర్‌లో మరీ స్పీడైపోయిన ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఆ వ్యవహారంలో కూడా పార్టీ నుంచి నో రెస్పాన్స్ అనే టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో. లోకల్‌గా ఏం జరిగిందో, ఏం జరుగుతోందో అంతా తమకు తెలుసునని, నచ్చితే ప్రోగ్రామ్స్‌కి వెళ్ళండి, లేదంటే దూరంగా ఉండండి…. అంతేతప్ప గీత దాటడం ఎవరికీ మంచిది కాదని టీడీపీ పెద్దలు తమ నాయకులకు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. దేనికైనా… సహనం ఉండాలేగానీ… ప్రతి విషయంలో ఇలా రచ్చ చేసుకుంటూ….. ఒక నియోజకవర్గం కోసం ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని వర్మకు చెప్పాల్సింది చెప్పేసినట్టు తెలిసింది. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలిగానీ… కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో సాధిద్దామనుకుంటే… అవన్నీ జరగని పనులని చెప్పారట. డెఫినెట్‌గా… కొన్ని ఇబ్బందులు ఉన్నాయి… కాదనడం లేదుగానీ… అంత మాత్రాన హై ప్రొఫైల్‌ సెగ్మెంట్‌లో ఇలా స్పీడ్ అయిపోతే నష్టం తప్ప లాభం ఉండదని, ఎక్కడ ఎవరికి ఎలా చెక్ పెట్టాలో తెలుసని కూడా క్లారిటీ ఇచ్చారట టీడీపీ పెద్దలు. మొత్తానికి వివిధ మార్గాల్లో తమ నాయకుల్ని సెట్‌ చేసి పిఠాపురం పంచాయతీని కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నంలో సీరియస్‌గా ఉన్నారట పసుపు పార్టీ పెద్దలు. ఓవర్ స్పీడ్ కంట్రోల్‌ అవకుంటే… కనెక్షన్స్ దెబ్బతింటాయని క్లారిటీగా చెప్పేస్తున్నారు..నచ్చితే కలవండి లేదంటే దూరంగా ఉండండి… అంతే తప్ప కెలుకుడు పాలిటిక్స్‌ చేస్తే మాత్రం మేటర్‌ వేరేలా ఉంటుందంటూ స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. కానీ… తాజాగా వర్మ చేసిన కామెంట్స్‌ ఆయన తగ్గలేదా అన్న డౌట్స్‌ని పెంచుతున్నాయి. లోకేష్‌ పాదయాత్రవల్లే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిందని వర్మచేసిన కామెంట్స్‌ ఎందదూరం వెళ్తాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోందట. పిఠాపురం టీడీపీ మేటర్‌ని ఎంత దూరం తీసుకువెళ్తుంది? తెగేదాకా లాగుతూ కామెంట్స్‌ ఉధృతి పెంచుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.