NTV Telugu Site icon

Off The Record : పలాసలో హాట్ హాట్ పాలిటిక్స్..

Otr Palasa

Otr Palasa

ఆ నియోజకవర్గంలో రాజకీయం యమా రంజుగా మారుతోందట. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యుద్ధం టామ్‌ అండ్ జెర్రీని తలపిస్తోందట. తగ్గేదే లే అన్నట్టుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రక్తి కట్టిస్తున్నారు. ఛాన్స్‌ దొరికితే చట్రంలో ఇరికించే ప్రయత్నం జరుగుతున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా ఇద్దరు నేతలు? శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పాలిటిక్స్‌ హాట్‌ హాట్‌గా మారుతున్నాయి. సవాళ్ళు సెగలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మధ్య రివెంజ్‌ రాజకీయాలు నడుస్తున్నాయన్నది లోకల్‌ టాక్‌. తమ పార్టీ పవర్‌లోకి రాగానే ఆపరేషన్‌ అప్పలరాజు చేపట్టారట శిరీష. ఆయన పదవిలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకలు, అక్రమాలను నిగ్గుతేల్చే పని మొదలుపెట్టినట్టు చెప్పుుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు కేసులు బుక్‌ అయ్యాయి ఆయన మీద. ఆ రెండూ గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శిరీష హెచ్చరించినవే కావడంతో… రివెంజ్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయా అన్న చర్చ జరుగుతోంది.

అలాగే… సీదిరి అనుచరుల మీద కూడా దృష్ఠి సారించారట ఎమ్మెల్యే. అదే సమయంలో మాజీ మంత్రి కూడా ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు. సై అంటే సై అనాల్సిందేనంటున్నారట ఆయన. త్యాగాలకు సిద్ధంగా ఉండమంటూ తన అనుచరులకు పిలుపునిచ్చినట్టు తెలిసింది. తమ హయాంలో ఐదేళ్ళలో ఒక్క కేసుకూడా గౌతు శిరీషపై నమోదవలేదని, ఆమె మాత్రం అధికారంలోకి రాగానే… రివెంజ్‌ పాలిటిక్స్‌కు తెరలేపారని అంటున్నారట. తమను ఏదో కేసులో అరెస్ట్ చేయాలని చూస్తున్నారని, అన్నిటికీ సిద్ధమంటూ సవాల్‌ విసురుతున్నట్టు తెలిసింది. మందస, వజ్రపుకొత్తూరు , పలాస మండలాల్లో తమ ప్రధాన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని, అయినా భయపడేది లేదని అంటున్నారట సీదిరి. అలాగే తాను అవినీతి, అక్రమాలు చేసినట్టు నిరూపిస్తే…దేనికైనా సిద్ధమంటున్నట్టు తెలిసింది. ఇలా ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో పలాస రాజకీయం యమా హాట్‌గా మారుతోంది.

Show comments