NTV Telugu Site icon

Off The Record: తెలంగాణ కార్యక్షేత్రంగా కాంగ్రెస్‌ పార్టీ భారీ స్కెచ్‌ వేస్తోందా?

Cong

Cong

Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్‌కు డూ ఆర్‌ డై అన్నట్టుగా తయారయ్యాయి. అందుకే… కలిసి వచ్చే ప్రతి అంశాన్ని వదులుకోకుండా వాడుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే… తొలిసారి రాష్ట్రంలో ఈ నెల16, 17 తేదీల్లో సిడబ్ల్యుసి సమావేశాలు పెట్టబోతోంది. ఈ సమావేశాల్లో కీలకమైన అంశాలపై పార్టీ విధాన నిర్ణయాలను ప్రకటించబోతోంది. ఖమ్మం సభతో వచ్చిన జోష్‌ని ఈ నెల 17న నిర్వహించే తుక్కుగూడ సభతో కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఈ సభ ద్వారా సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ ముగ్గురిని ఒకే వేదిక మీద చూపి తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వాలన్నది పార్టీ ప్లాన్‌. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సిడబ్ల్యుసి సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నందున సామాజిక తెలంగాణ నినాదంతో బీసీ జనగణన కులాల వారీగా నిర్వహించడానికి కాంగ్రెస్ విధాన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉన్నందున ఈ తీర్మానానానికి ఫిక్స్ అయినట్టు తెలిసింది.

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ చేతుల మీదుగానే.. రాష్ట్ర ప్రజలకు ఐదు గ్యారంటీ పథకాలను ప్రకటించాలనుకుంటోంది కాంగ్రెస్‌. రాష్ట్రం ఇచ్చిన పార్టీకి ఒక్క ఛాన్స్‌ ఇవ్వండంటూ ఇప్పటికే అప్పీల్‌ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటి వరకు ప్రియాంకతో నిరుద్యోగ డిక్లరేషన్, రాహుల్ తో రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. సోనియా గాంధీ నోటి నుంచి ఐదు గ్యారంటీ పథకాలు ప్రకఠించాలని ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో రైతులకు రెండు లక్షల రుణ మాఫీ, వృద్ధాప్య పెన్షన్‌ని 4 వేలకు పెంచడం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్‌ సిలిండర్. ఇలా.. ఈ ఐదు అంశాలను డిక్లరేషన్‌లో పొందు పరచబోతోందట టి కాంగ్రెస్‌. మరో గ్యారంటీ.. స్కీంలో దళిత.. గిరిజన, బీసీ విద్యార్థుల అంశాలను తీసుకోవాలని చూస్తోంది. వీటిని నేరుగా సోనియా ప్రకటిస్తే… జనంలో హైప్ వస్తుందని అంచనా వేస్తోంది కాంగ్రెస్‌. ఐదు గ్యారెంటీ స్కీంలు ప్రకటించడంతో పాటు… cwc సమావేశాలకు వచ్చిన 119 మంది జాతీయ నాయకులను ఒక్కో నియజక వర్గానికి పంపి.. ఆ స్కీమ్స్‌పై ప్రచారం చేయించాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇలా చేస్తే.. కాంగ్రెస్ మేనిఫెస్టో ఇల్లిల్లు చేరుతుందన్నది పార్టీ అంచనా.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ cwc ని ప్రచారం కోసం వాడుకోవాలని చూస్తోంది పార్టీ. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌కి ఐదు గ్యారంటీ స్కీములు అధికారాన్ని కట్టబెడతాయా ..? పార్టీని జనానికి చేరువ చేస్తుందా అన్నది చూడాలి.