Off The Record: కాలానుగుణంగా పొలిటికల్ ట్రెంట్స్ కూడా మారుతున్నాయి. కొత్త కొత్త పరిస్థితులు, నేతల మనస్తత్వాలకు అనుగుణంగా పద్ధతుల్ని కూడా మార్చేస్తున్నాయి పార్టీల అధినాయకత్వాలు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ఒక అడుగు ముందుండే తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో కూడా ప్రత్యేకత నిలబెట్టుకునేలా కొత్త ట్రెండ్ మొదలుపెట్టింది. గతంలో నేతల మధ్య ఏవైనా వివాదాలు ఉంటే.. అధినేత పిలిపించడం మాట్లాడటం.. సర్దుకోమని…..ఆ తర్వాత పాటించిన వాళ్ళు పాటించడం లేదంటే మానేయడం రివాజుగా మారింది. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్‌కు తగ్గట్టు మూస ధోరణికి చెక్‌పెట్టి వినూత్నంగా ఆలోచించింది పార్టీ అధినాయకత్వం. అదే డిన్నర్ ట్రెంట్. అయినదానికి, కాని దానికి అమరావతి దాకా పరుగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు. ముందు లోకల్‌గా మీరంతా కూర్చుని మాట్లాడుకోండి. అప్పటికీ తెగకుంటే ఆ సంగతి తర్వాత చూస్తామని చెప్పిందట అధిష్టానం. ఆ క్రమంలోనే…ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14కు 14అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ సీట్లలో పాగా వేసింది టీడీపీ. ఆ స్థాయిలో గెలుపు దక్కినా…. జిల్లా పార్టీలో మాత్రం అంత సంతోషం ఎక్కడా కనిపించడం లేదట. నేతల మధ్య ఐక్యత ఎక్కడా కనిపించడం లేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.
అస్సలు ఒకర్ని చూస్తే ఒకరికి సరిపోవడని బ్యాచ్ కూడా ఉందని మాట్లాడుకుంటున్నారు. దాంతో… అధిష్టానం కూడా దీనిపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో సమష్టిగా ముందుకెళ్లాలని సూచించారు. కానీ… స్వయంగా అధినేత చెప్పినా… జిల్లా నేతల్లో ఏ మాత్రం మార్పు రాలేదు, ఐక్యంగా అంతకంటే ఉండటం లేదు. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకుల మధ్య సైతం గ్యాప్ ఉందన్న చర్చ నడుస్తోంది. దీంతో ఈ సమస్యలన్నిటి పరిష్కారానికి ప్రతిసారి పార్టీ ఆఫీస్‌కు పిలవడం, వార్నింగ్స్ ఇవ్వడం లాంటివి కాకుండా ప్రత్యామ్నాయం సూచించింది పార్టీ అధిష్టానం. అదే డిన్నర్ పాలిటిక్స్ వ్యూహం. ఎంత విభేదాలున్నా… మాట్లాడుకోకున్నా…. అంతా కలిసి ఒక చోట కూర్చుని, కలిసి భోంచేస్తే…. ఆ ఫీల్ వేరుగా ఉంటుంది… పాజిటిల్ వైబ్స్ వస్తాయన్న ఉద్దేశ్యంతో డిన్నర్ మీటింగ్స్‌కు ప్లాన్ చేశారట. గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరికీ ఒక కామన్ టాస్క్ పెట్టారు. కుదిరితే వారానికి, లేదంటే పదిరోజులకు ఒక ఎమ్మెల్యే ఇంట్లోనైనా భోజనానికి ఏర్పాటు చేసి జిల్లాలోని సహచర శాసనసభ్యులందర్నీ పిలవాలన్నది పార్టీ పెట్టిన రూల్. ఆ విధంగా అంతా కలిసి కూర్చుని భోంచేస్తూ మాట్లాడుకోవడం, అందు ముందు, ఆ తర్వాత పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం లాంటివి చేస్తే… వాతావరణం తేలిక పడుతుందన్నది టీడీపీ అధిష్టానం వ్యూహం.
ఇక ఎమ్మెల్యేల మధ్య సమన్వయ బాధ్యతను జిల్లా పార్టీ అధ్యక్షుడికి అప్పగించారు. ప్రతివారం ఒక ఎమ్మెల్యే నివాసంలో కచ్చితంగా కలవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఫస్ట్ మీటింగ్ మొదలవకపోయినా…. నేతలు దీన్ని ఎంతవరకు పాజిటివ్‌గా తీసుకుంటారన్న చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎదురుపడితే పలకరించుకోవడం తప్ప కలిసి మెలిసి పనిచేసే వాతావరణమే లేదన్నది విస్తృతాభిప్రాయం. ఇలాంటి సమయంలో ఈ డిన్నర్ పాలిటిక్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయన్నది అనుమానమేనన్నది కొందరి మాట. ఎమ్మెల్యేల్లో ఒకరటే ఒకరికి సరిపోక.. జట్లుగా విడిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తూ పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలంతా దూరంగా ఉంటున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపాలంటే… ఇలాంటి మీటింగ్స్ తప్పనిసరి అన్నది టీడీపీ అధిష్టానం ఆలోచన. తరచూ ఇలాంటి డిన్నర్ మీటింగ్స్‌తో నాయకుల మధ్య సమన్వయంతో పాటు పార్టీ క్యాడర్‌లో కూడా ఐక్యత పెరుగుతుందని, దాని ప్రభావం స్థానిక ఎన్నికల్లో గట్టిగానే ఉంటుందన్నది పార్టీ పెద్దల మనోగతం. కానీ… ఇక్కడే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్‌ని ప్రస్తావిస్తున్నారు కొందరు. పైవాళ్ళు చెప్పడం వరకు బాగానే ఉందిగానీ… ప్రతివారం ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా ఎక్కడున్నాసరే వచ్చి కచ్చితంగా జిల్లా డిన్నర్ మీటింగ్‌లో పాల్గొనాలంటే సాధ్యమవుతుందా అన్నది వాళ్ళ ప్రశ్న. ప్రాక్టికల్‌గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్న డౌట్స్‌ని అలా ఉంచితే… ఆలోచన మంచిదేనని, కష్టమో, నిష్టూరమో… ఒక రోజు అటు ఇటుగానైనా… జిల్లా ఎమ్మెల్యేలంతా ఒకే చోట కూర్చుంచే మాత్రం ఆ ఫీల్, ఆ రిజల్ట్ వేరుగా ఉంటాయన్నది కేడర్ వాయిస్.
