Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!

  • డీఎస్సీలో అక్రమాల పేరిట వైసీపీ ఆందోళనలు..
  • ఆరోపణలపై మొదట్లోనే అధికారుల క్లారిటీ..
  • తాజాగా జిల్లా, మండల స్థాయి ఆందోళనలకు వైసీపీ సిద్ధం..
  • దేశంలో నీట్ ఆందోళనల తర్వాత డీఎస్సీపై వైసీపీ సీరియస్‌ టర్న్‌..
  • ఇక ఉపేక్షిస్తే దెబ్బ తింటామనుకుంటున్న ప్రభుత్వ పెద్దలు..
  • కౌంటర్‌ అటాక్స్‌కు కూటమి నేతలంతా సిద్ధం?..
  • వైసీపీకి లెఫ్ట్‌, యువత తోడైతే ఇబ్బందులు తప్పవన్న క్లారిటీ...
Otr Ap Dsc,

Otr Ap Dsc,

Off The Record: డీఎస్సీ సెలక్షన్స్‌ విషయమై ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది ప్రతిపక్షం వైసీపీ. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, దాని మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్‌ చేస్తోంది. జిల్లాల వారీ ఆందోళనలు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలతో ఈ అంశాన్నివీలైనంత ఎక్కువ లాగి జనంలోకి తీసుకువెళ్ళాలన్నది ప్రతిపక్షం ప్లాన్‌గా తెలుస్తోంది. మొదట్లో ఇదే డిఎస్సీపై అనేక ఆరోపణలు చేసిన వైసీపీకి అధికారులు వరుస ప్రెస్ మీట్స్‌ పెట్టి క్లారిఫికేషన్‌ ఇచ్చారు. అయితే… స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఆందోళనలు తీవ్రం చేస్తోంది ఫ్యాన్‌ పార్టీ. అందుకోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు…. జిల్లా, మండల స్థాయిలో కూడా నిరసన ప్రదర్శనలకు ప్లాన్‌ చేస్తోంది. దీంతో… ముందు లైట్‌ తీసుకోవాలనుకున్నా… మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేయిదాటి పోతుందన్న ఉద్దేశ్యంతో… మరింత ముదరకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే నీట్‌ పేపర్‌ లీక్‌ ఆందోళనల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారట. డీఎస్సీపై మొదట్లో ఆరోపణలు చేసినా…. అధికారుల వివరణల తర్వాత ఆ ఉధృతి కాస్త తగ్గినట్టు కనిపించింది. కానీ… దేశ వ్యాప్తంగా నీట్ ఆందోళనలు, సీజేపీ దెబ్బకు కేంద్ర మంత్రి రాజీనామా లాంటి పర్యవసానాల తర్వాత వైసీపీ సీరియస్‌గా డీఎస్సీ టర్న్ తీసుకోవడం గురించి కూటమివర్గాల్లో చర్చ జరుగుతోందట. డీఎస్సీకి సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చామని, అవసరం అయితే బహిరంగ చర్చకు కూడా రెడీగా ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేశారు మంత్రి లోకేష్.

అయినా…. అదంతా లైట్‌ అన్నట్టు ఆ స్టేట్‌మెంట్స్‌ని పట్టించుకోకుండా… వైసీపీ డీఎస్సీపై పదే పదే ఆరోపణలు చేయడం, ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో…. ఇక లాభం లేదు గట్టిగా కౌంటర్స్‌ వేయాలని కూటమి పెద్దలు డిసైడైనట్టు తెలుస్తోంది. వైసీపీది అంతా దుష్ప్రచారం అంటూ… సీఎం చంద్రబాబు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ప్రతిపక్షం అనవసరంగా… లేనివి ఉన్నట్టు చూపిస్తూ…. ఏదో చేయాలనుకుంటోందని, ఆ పార్టీ ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారాయన. ఇప్పుడామాటల్ని కేవలం టీడీపీ వాళ్ళే కాకుండా… మొత్తం కూటమి నేతలంతా పరిగణనలోకి తీసుకుని పాటిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అంత్య నిష్ఠూరం కన్నా…ఆది నిష్ఠూరమే బెటర్ అన్న లెక్కలో కూటమి ముందుకు వెళ్తోందట. డీఎస్సీ అనేది నిరుద్యోగులు, యువతకు సంబంధించిన అంశం కాబట్టి….ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే అనవసరమైన డిస్ట్రబెన్స్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారట కూటమి నేతలు. అందుకే… ఇక జాప్యం చేయకుండా…. డీఎస్సీకి సంబంధించి వెంటనే ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశానికి సంబంధించిన కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఆందోళనల్ని లైట్‌గా తీసుకుని రేపు వాళ్ళకు లెఫ్ట్‌ పార్టీలు, యువత కూడా తోడైతే అనవసరమైన ఇబ్బందులు వస్తాయన్నది కూటమి భావనగా తెలుస్తోంది. దీంతో వెంటనే అలెర్ట్ అవ్వడం, సరైన కౌంటర్ ఇవ్వడం మీద దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇది సున్నితమైన అంశం కాబట్టి… వైసీపీ చెప్పే మాటలు, చేసే ఆరోపణల్లో నిజా నిజాలు పక్కన పెట్టి….ముందు జనంలో దానికి సంబంధించిన చర్చ సీరియస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట కూటమి పెద్దలు.