Site icon NTV Telugu

Tourism : సమ్మర్ హాలీడేస్ లో అక్కడికి వెళ్దాం..

Torism

Torism

సమ్మర్ సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్ని మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? అని పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీ్ర్ లోని లద్దాఖ్ కో, ఒడిశాలో మయూర్ భంజ్ కు ప్రయాణమైపోవడమే.. ఆ రెండే ఎందుకంటారా ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి. అరుదైన పులులు, పురాతయన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం అక్కడ లభిస్తాయని తెలుస్తోంది. ఇవన్నీ లద్దాఖ్, మయూర్ భంజ్ లకు 50 పర్యాటక ప్రాంతాలతో రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపిస్తుందని తెలిపింది. మంచుకొండలు, టిబెటన్ బౌద్ద సంస్కృతి కనువిందు చేస్తాయి.. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాల్సిందే.

Also Read : Telangana: చైల్డ్ పోర్న్ చూస్తే జైలుపాలే.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక

ఇక మయూర భంజ్ అంటే పచ్చదనం.. సాంస్కృతి వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం, ప్రపంచంలో నల్లపులి సంచరించే ఏకైక ప్రాంతం అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్ లో మయూర్ భంజ్ లో జరిగే చౌ డ్యన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని పేర్కొంటారు. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా( ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్),టక్సాన్ ( అరిజోనా ), యోసెమైట్ నేషనల్ పార్క్ ( కాలిఫోర్నియా ) వంటివి వాటిలో ఉన్నాయి.

Also Read : Asaduddin Owaisi: బీహార్‌లో కేసీఆర్‌పై ఓవైసీ ప్రశంసలు.. విజన్ ఉన్న నాయకుడంటూ కితాబు

Exit mobile version