NTV Telugu Site icon

Odisha High Court: అలా చేస్తే అత్యాచారం కాదు.. ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

Odisha

Odisha

Odisha High Court: ఒడిశా హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పు చెప్పింది. అత్యాచారం కేసులో నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని తీర్పు వెలువరించింది. దీంతో బాధితురాలు నివ్వెరపోయింది. ఓ మైలురాయి తీర్పులో ఒక వ్యక్తి తన భాగస్వామిని వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్న సందర్భంలో అది అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు పేర్కొంది.

అసలేం జరిగిందంటే.. ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కొన్ని రోజులు సహజీవనం చేశాడు. మోజు తీరాకా మహిళను వదిలి పారిపోయాడు. దీంతో కంగుతిన్న మహిళ అతడిపై కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు.

Also Read: PM Modi: గీతాప్రెస్ ఓ దేవాలయం, గాంధీజీకి ప్రత్యేక అనుబంధం ఉంది.. కాంగ్రెస్‌కు కౌంటర్

ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్‌ దరఖాస్తు చేసుకున్న నిందితుడి విన్నపాన్ని కోర్టు నిరాకరించింది. చేసేది లేక నిందితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ.. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేసినందుకు దీన్ని అత్యాచారంగా పరిగణించలేమని న్యాయస్థానం చెప్పింది. నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలాగే బాధిత మహిళను బెదిరించవద్దని.. అతడికి కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కేసు విచారణకు సహకరించాలని ఇద్దరు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కోర్టు ఆందోళన చెందే విషయం ఏమిటంటే, మొదట స్నేహాన్ని ప్రారంభించి నిజమైన సంబంధాన్ని పెంచుకున్నట్లయితే, ఇరువురి అంగీకారంతో శారీరకంగా ఒక్కటైతే… దానిని అత్యాచారానికి పాల్పడినట్లు నిందించకూడదని జస్టిస్ పట్నాయక్ పేర్కొన్నారు. ఇది ద్వేషపూరిత చర్య కాదని, ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం నేరం కాదంటూ జస్టిస్ పట్నాయక్ జూలై 3న ఉత్తర్వులు జారీ చేశారు.