NTV Telugu Site icon

CM KCR : బీఆర్‌ఎస్‌లో చేరిన ఒడిషా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌

Cm Kcr

Cm Kcr

ఒడిషా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ నేడు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గమాంగ్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు. అయితే.. గిరిధ‌ర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

Also Read : Adani Group: అదానీ గ్రూపులో దర్యాప్తు చేయాల్సిందే.. కాంగ్రెస్ డిమాండ్

ఆయ‌న కుమారుడు శిశిర్ గ‌మాంగ్ సైతం బీజేపీకి రాజీనామా చేశారు. ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్‌ గమాంగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్‌ సొంత రాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిచారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్‌, లక్ష్మీపూర్‌ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్‌ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్‌ సతీమణి హేమ గమాంగ్‌ 1999లో ఎంపీగా వ్యవహరించారు.

Also Read : Perni Nani: లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడు.. పేర్ని నాని ఫైర్