NTV Telugu Site icon

World Cup 2023: తొమ్మిదింట్లో ఒకటే ముగిసింది.. ఎలాంటి కంగారు లేదు!

Australia Team Cwc 2023

Australia Team Cwc 2023

Australia Captain Pat Cummins Says I have already forgotten about Virat Kohli’s Catch Drop Matter: వన్డే ప్రపంచకప్‌ 2023ని టైటిల్ ఫెవరేట్ ఆస్ట్రేలియా ఓటమితో ఆరంభించింది. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్‌ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఏ ఓటమిపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌లో ఒకటే ముగిసిందని, ఎలాంటి కంగారు అవసరం లేదు అని తెలిపాడు.

‘మరో 50 పరుగులు చేయాల్సి ఉంది. ఈ పిచ్‌పై పరుగులు చేయడం చాలా క్లిష్టంగా మారింది. భారత బౌలింగ్‌ ఎటాక్‌ మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఎక్కువ రన్స్ సాధ్యపడలేదు. 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. అయినా మేము ప్రయత్నించాం. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. అద్భుత ఆరంభం ఇచ్చారు. అయితే మా జట్టులో ఒక స్పిన్నర్‌ తక్కువగా ఉన్నాడనే వాదన సరికాదు. మాకు 20 ఓవర్ల స్పిన్‌ బౌలింగ్‌ అందుబాటులో ఉంది’ అని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు.

Also Read: Bhagavanth Kesari: హనుమకొండలో బతుకమ్మ ఆడిన కాజల్‌ అగర్వాల్, శ్రీలీల.. వీడియో వైరల్‌!

‘భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ క్యాచ్‌ను జారవిడవడం ఇబ్బంది కలిగించింది. అయితే ఆ క్యాచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. ఆ ఘటన జరిగిన కాసేపటికే వదిలేశా. ఒకవేళ కోహ్లీ క్యాచ్ పట్టి ఉంటే.. 4/10తో మాకు డ్రీమ్‌ స్టార్ట్‌ లభించేది. జోష్ హేజిల్‌వుడ్ క్లాస్‌ బౌలర్. తప్పకుండా ఈ ఓటమిపై మేం సమీక్షించుకుంటాం. తొమ్మిదింట్లో ఒకటే మ్యాచ్ ముగిసింది. ఎలాంటి కంగారు అవసరం లేదు. ఇంకా మాకు 8 మ్యాచులు ఉన్నాయి. ఇక టాస్ విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Show comments