Site icon NTV Telugu

Odela 2 Firstlook: ‘ఓదెల 2’ నుంచి తమన్నా ఫస్ట్‌లుక్ వచ్చేసింది!

Odela 2 Firstlook

Odela 2 Firstlook

Tamannaah’s Firstlook Out from Odela 2: రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. గ్రామీణ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, పూజిత పొన్నాడలు తమ నటనతో ఆకట్టుకున్నారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘ఓదెల 2’గా సీక్వెల్ రాబోతుంది.

ఓదెల 2గా వస్తున్న సీక్వెల్‌కు కథ, కథనంతో పాటు నిర్మాతగా కూడా డైరెక్టర్ సంపత్ నంది వ్యవహరిస్తున్నారు. ఈ సీక్వెల్‌ని కూడా అశోక్ తేజనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ మార్చి 1న జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా మేకర్స్ ప్రారంభించారు. ఓదెల రైల్వే స్టేషన్‌లో హెబ్బా పటేల్ నటించగా.. ఓదెల 2లో మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నారు. నేడు మహాశివరాత్రి సందర్భంగా తమన్నా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు.

Also Read: అండర్19 ప్రపంచకప్ కలిసి ఆడారు.. 100 టెస్ట్ మ్యాచ్‌ కలిసే ఆడారు! మధ్యలో మరెన్నో

కాశీ గంగా నది తీరాన తమన్నా నడుస్తున్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ చేతిలో ఢమరుఖం, మరో చేతిలో దండం పట్టుకుని తమన్నా ఉన్నారు. శివ శక్తిగా ఆమె నటిస్తున్నారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి పార్ట్ ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈసారి థియేటర్లలో పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్ సంస్థలపై డి మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాంతారా, విరూపాక్ష, మంగళవారం వంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన అంజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.

Exit mobile version