NTV Telugu Site icon

Obama sister: అమెరికా మాజీ అధ్యక్షుడి సోదరిపై కెన్యాలో టియర్ గ్యాస్

Obama

Obama

పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా అట్టుడికింది. మంగళవారం పార్లమెంట్ కొత్త పన్నుల విధానాన్ని ఆమోదించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి యత్నించారు. మరోవైపు ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. నిరసనకారులు కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు భాష్పవాయువు, నీటి ఫిరాంగులు ఉపయోగించారు. ఇక పరిస్థితి చేయిదాటడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఇప్పటికే పలువురు చనిపోయారు. ఇదిలా ఉంటే కెన్యా నిరసనలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సోదరి ఔమా కూడా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: BEL Requirements : బెల్ లో భారీగా ఉద్యోగాలు భర్తీ.. నెలకు జీతం రూ.90వేలు..

నిరసనలో పాల్గొన్న ఔమా ఓ మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆమె కళ్లు మంటలు ఎక్కడంతో విలవిలలాడిపోయారు. కళ్లు పోయాయంటూ ఆవేదన చెందారు. సహాయకులు ఆమెను అక్కడ నుంచి తీసుకునిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కెన్యాలో కొత్త పన్నుల విధానాన్ని మంగళవారం పార్లమెంట్ ఆమోదించింది. నిరసనకారులు పార్లమెంట్‌కు నిప్పు పెట్టారు. కొంత భాగం కాలిపోయింది. అలాగే ఇరు పక్షాలు తీవ్రంగా గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Alcohol Kills: ఆల్కహాల్ వల్ల ప్రతీ ఏడాది 30 లక్షల మంది మృతి: డబ్ల్యూహెచ్ఓ