రెండు నెలల నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన స్థంభించిందని, కవిత ఈడీ నోటీసుల నుంచి అసలు రాష్ట్రంలో పాలన సాగడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత వెనకాలే ఢిల్లీకి వెళ్తోన్న మంత్రులు.. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కవిత న్యాయ సలహా కోసం ప్రభుత్వ అధికారులను వాడుకుంటుందని, పోలీసు ఉన్నత, న్యాయ ఉన్నత అధికారులు కవిత ఈడీ కేసు రివ్యూ మీటింగ్ లో పాల్గొంటున్నారన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, పంట నష్టం, నగరంలో భవనాలు కూలుతున్న, కాలుతున్న పట్టించుకునే నాథుడే లేడని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బంధుప్రీతి తో కూడుకున్న పాలన నడుస్తోందని, మంత్రులు అధికారిక ప్రెస్ మీట్ లో ప్రభుత్వ పరమైన విషయాలు వదిలేసి రాజకీయ విమర్శలు చేస్తున్నారన్నారు. ఉన్నత అధికారులు మంత్రుల పక్కనే ఉంటున్నారని, వాళ్లేం ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ లో కూర్చొంటున్నారు? అని ఆయన ప్రశ్నించారు. సీఎం పర్యటన కంటి తుడుపు చర్య అని, ప్రకటించిన నష్టపరిహారం కూడా ఇదే విధంగా ఉందని ఆయన విమర్శించారు.
Also Read : Amritpal Singh: ఎన్‌ఆర్‌ఐ నుంచి ఐఎస్‌ఐ హ్యాండ్లర్ వరకు.. ఖలిస్తానీ నాయకుడి వెనుకున్న వ్యక్తులు వీరే..
తొమ్మిది ఏళ్లలో అనేక సార్లు పంట నష్టం జరిగిన సీఎం ఏనాడైనా పట్టించుకున్న పాపం లేదన్నారు. టీఎస్పీఎస్సీలో రోజుకో విషయం బయటికి వస్తోందని, తవ్వుతున్న కొద్ది పేర్లు బయటికి వస్తున్నాయన్నారు. ఒకటికన్నా ఎక్కువ సంఖ్యలో పేపర్లు లీకేజీ జరిగాయని తెలుస్తోందని, దీనికి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. లేదంటే కేసీఆర్.. కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ‘టీఎస్పీఎస్సీలో ఇంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలు ఎవరివి.? వీరికి సీఎంవో కు ఉన్న సంబంధం ఎంటి? సిట్ విచారణలో తేల్చాలి. కూతురు, కొడుకు కోసం 4కోట్ల రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కేసీఆర్ గాలికి వదిలేశారు. మంత్రులు రాజీనామా చేసి కవిత కోసం పోండి. రాజ్యాంగ సంస్థలను రాజకీయం చేసిన ఘనత కేసిఆర్ కి దక్కుతుంది. సీఎం కేసీఆర్ ను ఒక యూనివర్శిటీలో ప్రసంగంచకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. అందుకే కేసీఆర్ నిరుద్యోగుల మీద కక్ష కట్టారు. గతంలో ప్రకటించిన నష్ట పరిహారం ఏమైంది?’ అని ఆయన విమర్శించారు.
Also Read : Pan India: సెప్టెంబర్ నెల మొదలు…. చివర మనదే!
