Site icon NTV Telugu

నేడు తిరుమలకు సీజే ఎన్వీ రమణ..షెడ్యూల్ ఇదే !

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ… శ్రీవారి దర్శనార్థం ఇవాళ తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం తిరుపతికి చేరుకునే ఆయన తిరుచానూరుకు వెళ్తారు. అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోన్నారు. ఎన్వీ రమణతో పాటు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోన్నారు. అంతేకాదు… ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్న ఎన్వీ రమణ… రేపు చక్రస్నానంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు ఎన్వీ రమణ. ఇక ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర కూడా తిరుమలకు రానున్నారు.

Exit mobile version