NTV Telugu Site icon

Trivikram: బర్త్ డే సందర్భంగా ‘నువ్వే నువ్వే’ అంటున్న ఆయన అభిమానులు

Trivikram

Trivikram

Trivikram: అమ్మ ఆవకాయ అంజలి బోరుకొట్టవంటూ.. మాటల మాంత్రికుడిగా.. పెన్నుతోనే హాస్యాన్ని చిలుకుతూ.. అబ్బుర పరిచే డైలాగులతో ప్రేక్షకుల మదిలో నిలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా తెలుగు తెరకు పరిచయమై దర్శకుడిగా టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వునాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి వంచి చిత్రాల విజయంలో త్రివిక్రమ్ డైలాగులే ప్రధాన భూమిక పోషించాయి అనడంలో సందేహం లేదు. మొదటిసారిగా తరుణ్, శ్రియ జంటగా నువ్వే నువ్వే చిత్రంతో మెగా ఫోన్ చేతబట్టారు. అకోబర్ 10,2002న విడుదలై ఈ సినిమా ఓ రేంజ్ లో యూత్ లోకి దూసుకెళ్లింది. గత నెల10తో సినిమా విడుదలై 20ఏళ్లయింది. దీనిని ఘనంగా సెలబ్రేట్ చేశారు చిత్రబృందం.

Read Also: Engineering student: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాను 4వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు శ్రీ స్రవంతి మూవీస్. ఆ రోజు నుంచి 7వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్స్ లో ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయడమనేది ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ గా మారింది. ఇలా థియేటర్స్ కి వస్తున్న కొన్ని సినిమాలకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి కోటి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ‘నా మనసుకేమైంది’ పాట విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది. ఇక మిగతా పాటల పరంగా చూసుకున్నా, ఇది మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.