NTV Telugu Site icon

Student Suicide: కాలేజీలోని వాష్‌రూమ్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

Student Suicide

Student Suicide

Student Suicide: కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సేథ్ సుఖ్‌లాల్ కర్నానీ మెమోరియల్ హాస్పిటల్ (ఎస్‌ఎస్‌కెఎం)లో నర్సింగ్ విద్యార్థిని గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మెడికల్ కాలేజీలోని బాలికల హాస్టల్‌లో బాత్‌రూమ్‌లో రెండో సంవత్సరం నర్సింగ్ విద్యార్థిని మృతదేహాన్ని ఆమె స్నేహితులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన విద్యార్థి ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం స్నేహితులు వచ్చి చూడగా బాత్‌రూమ్‌ లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. వారు తలుపులు పగులగొట్టి చూడగా ఆమె బట్టల హ్యాంగర్‌కు ఉరివేసుకుని కనిపించింది.

Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి

ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె గదిలోంచి ఇప్పటివరకు ఎలాంటి నోట్ లభించలేదు. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కోల్‌కతా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.