Site icon NTV Telugu

Nupur Sharma: స్వీయరక్షణ కోసం నుపుర్‌శర్మకు తుపాకీ లైసెన్స్

Nupur Sharma

Nupur Sharma

Nupur Sharma: గత ఏడాది టీవీ చర్చలో ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిరసనలు, హింసకు కారణమై పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇప్పుడు తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారు. నుపుర్ శర్మ కోరిన తర్వాత స్వీయ రక్షణ కోసం ఢిల్లీ పోలీసులు ఆమెకు లైసెన్స్ ఇచ్చారని అధికారులు ఈరోజు తెలిపారు.

మే 26న తన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో దేశంలో నిరసనలకు కారణమైనందుకు క్షమాపణలు చెప్పాలని జులైలో సుప్రీంకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యల తర్వాత కూడా ఆమె తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. ఆమెకు మద్దతుగా మాట్లాడిన వారిని కూడా బెదిరించారు. దేశంలో జరిగిన రెండు హత్యలు ఈ వివాదంతో ముడిపడి ఉన్నాయి. ఆమెకు మద్దతుగా నిలిచిన ఉమేష్ కోల్హే అనే ఫార్మసిస్ట్ జూన్‌లో మహారాష్ట్రలోని అమరావతిలో హత్యకు గురయ్యాడు. కొన్ని రోజుల తర్వాత, సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చిన ఉదయపూర్‌లోని ఒక టైలర్ అతని దుకాణంలో నరికి చంపబడ్డాడు.

Delhi: ఆప్‌కు భారీ షాక్.. 10 రోజుల్లో రూ.163.62 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..

వివాదం నేపథ్యంలో నుపుర్‌ శర్మ ప్రాణానికి ముప్పు ఉందని ఆమె తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అజ్మీర్ దర్గా ఉద్యోగి ఆమె గొంతు కోస్తానని వీడియోలో బెదిరించడం, మరొక యూపీ నివాసి ఆమెను దుర్భాషలాడడం, ఆమె తల నరికివేస్తానని బెదిరించడం వంటి సందర్భాలు ఉన్నాయి. నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు తన జులై ఆర్డర్‌లో ఇలా పేర్కొంది. దేశవ్యాప్తంగా రగిలిన భావోద్వేగాలకు, దేశంలో జరుగుతున్న నిరసనలకు ఆమె బాధ్యత వహిస్తుందని న్యాయస్థానం పేర్కొంది.

Exit mobile version