NTV Telugu Site icon

IND vs SA Records: మూడో టీ20 మ్యాచ్‌లో రికార్డుల జోరు.. ఎవరెవరు ఏ రికార్డ్స్ సృష్టించారంటే?

Ind Vs Sa

Ind Vs Sa

IND vs SA Records: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో అజేయంగా 107 పరుగులు, అభిషేక్ శర్మ 50 పరుగులతో భారత్ భారీ స్కోరు 219/6 చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సెన్ అద్భుత ప్రదర్శన చేసాడు. అతడు కేవలం 17 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అయితే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆతిథ్య జట్టుకు అది సరిపోలేదు. అర్ష్‌దీప్ సింగ్ తన అద్భుతమైన స్పెల్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ దక్షిణాఫ్రికాలో అత్యధిక T20 స్కోరు చేయడంతో సహా అనేక రికార్డులు బద్దలయ్యాయి. మరి వీటి విశేషాలు చూద్దామా..

దక్షిణాఫ్రికాలో అత్యధిక టి20 స్కోరు:

దక్షిణాఫ్రికా గడ్డపై టి20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును భారత్ సృష్టించింది. జట్టు 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు, T20 ప్రపంచ కప్ 2007లో డర్బన్‌లో ఇంగ్లాండ్‌పై చేసిన 218 పరుగులు అత్యధిక స్కోరు.

తిలక్ వర్మ సెంచరీ:

తిలక్ వర్మ 56 బంతుల్లో 7 సిక్సర్లతో అజేయంగా 107 పరుగులు చేసాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 22 సంవత్సరాల 5 రోజుల వయస్సులో టి20లో సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 21 ఏళ్ల 279 రోజుల వయసులో నేపాల్‌పై సెంచరీ చేయడం ద్వారా టీ20లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడుగా యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు.

అర్ష్‌దీప్ సింగ్:

అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను దాటి టి20లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అర్ష్‌దీప్ ఇప్పుడు టి20 ఫార్మాట్‌లో 92 వికెట్లు నేలకూల్చాడు. భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు) తర్వాత అతను రెండవ స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్‌లో ఇతర రికార్డులు:

* ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20లో అత్యధిక స్కోరు 200+ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. 2024లో 8వ 200+ స్కోర్‌ని సాధించింది.

* టి20 కెరీర్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టడంతో రమన్దీప్ సింగ్ రికార్డ్ లలోకి ఎక్కాడు. ఆ లిస్ట్ లో 8వ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

* ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసినవారిలో వరుణ్ చక్రవర్తి 10 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

* టి20లలో భారత్‌పై వేగవంతమైన అర్ధ సెంచరీ (ఎదుర్కొన్న బంతులు) చేసిన వ్యక్తిగా మార్కో జెన్సన్ 16 బంతులతో చేసి రికార్డ్ సృష్టించాడు.