Site icon NTV Telugu

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*నేడే బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాల బీఆర్‌ఎస్‌ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏటా పార్టీ ప్రజాప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించే బీఆర్‌ఎస్ ఈ ఏడాది సాధారణ సమావేశానికే పరిమితం చేయాలని నిర్ణయించింది. వేసవి తీవ్రత, అనావృష్టి, అకాల వర్షాలు తదితర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సుమారు 6 వేల మంది ప్రతినిధులతో బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి దర్శన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తొలుత భావించినా సాధారణ సభకే పరిమితమైంది. బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్‌, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా శాఖల అధ్యక్షులతో పాటు మొత్తం 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా అవతరించినా సర్వసభ్య సమావేశానికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారినే ఆహ్వానించారు. ఇవాల ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని వారం రోజుల క్రితం ఆహ్వానాలు పంపారు. ఉదయం 11 గంటలకు కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేసి సభను ప్రారంభిస్తారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించేలా ఎజెండాను రూపొందించారు.

*అవినీతిపై ఉక్కుపాదం
ఏపీలో అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్టర్ , ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేసింది. పలువురు అవినీతి అధికారులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. పలు డాక్యుమెంట్లు , లక్షల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14400కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహించి అవినీతి అధికారులను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్‌ గుజ్జర్లపూడి కరుణకుమార్‌ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కారులో లక్షా నాలుగు వేల రూపాయలు దొరకగా.. ఆ నగదుకు సరైన వివరాలు లేకపోవడంతో అవినీతి డబ్బుగా భావించి కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా తెర్లాం మండల హౌసింగ్‌ ఏఈ మత్స వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది.ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపిన వివరాల మేరకు.. కాలమరాజుపేట గ్రామానికి చెందిన ఇప్పిలి రామకృష్ణ కుటుంబానికి జగనన్న ఇల్లు మంజూరైంది. ఈ ఇంటికి బిల్లు చెల్లించేందుకు హౌసింగ్‌ ఏఈ రూ.20వేలు డిమాండ్‌ చేశారు. దీంతో రామకృష్ణ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సూచనల మేరకు రూ.20వేలు తెర్లాం హౌసింగ్‌ కార్యాలయంలో ఏఈకి అందజేశాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడిచేసి ఏఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో అనధికారికంగా ముగ్గురు పనిచేస్తున్నారని, వారు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు రావడంతో దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. కార్యాలయంలో ఉమామహేశ్వరయ్య, ఓబులయ్య, దిలీప్‌ అనధికారికంగా పనిచేస్తున్నట్టు గుర్తించామన్నారు. వీరికి జీతాలు ఎవరిస్తున్నారనే అంశంపై విచారణ చేస్తున్నామన్నారు. ఒక ప్రైవేట్‌ వ్యక్తి వద్ద ఉన్న రూ.5లక్షలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీలు జరుగుతున్నాయి.

*విశాఖలో కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు
విశాఖ తీరంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్లను టార్గెట్ చేసిన గ్యాంగ్.. డబ్బు ఆశచూపి అమాయకుల కిడ్నీ తీసుకుని మోసం చేస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ అరాచకాలు బయటపడ్డాయి. పెందుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుత్రి ఈ దారుణమైన కిడ్నీరాకెట్‌ దందాకి తెరతీసింది. పేదజనం అవయవాలను కాజేస్తోన్న ఓ ముఠా చేతిలో వినయ్‌కుమార్ అనే యువకుడు బలయ్యాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఏడుగురు బాధితుల నుంచి కేటుగాళ్లు కిడ్నీలు తీసేసుకున్నట్లు తెలిసింది. మధురవాడ వాంబే కాలనీకి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ వినయ్‌కుమార్‌‌తో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఉద్యోగి కామరాజుతో కొంత కాలంగా పరిచయం ఉంది. వినయ్ తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని తన బాధను చెప్పుకున్నాడు. ఇదే అదునుగా భావించిన కామరాజు.. కిడ్నీ అమ్మితే రూ.ఎనిమిదిన్నర లక్షలు వస్తాయని వినయ్‌కు చెప్పి నమ్మేలా చేశాడు.ఈ విషయం వినయ్ తల్లిదండ్రులకు తెలియడంతో అతడిన మందలించి.. ఇక్కడ ఉండొద్దని హైదరాబాద్ పంపించారు. తర్వాత కూడా కామరాజు తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితుడు వినయ్ తెలిపారు. కిడ్నీ ఇస్తానని మోసం చేశావని.. తల్లిదండ్రులను రోడ్డుకు ఈడుస్తానని బెదిరించాడని.. కామరాజు ఒత్తిడితో హైదరాబాద్‌ నుంచి వచ్చినట్లు వినయ్ చెప్పాడు. ఆ వెంటనే తనను రైల్వే న్యూ కాలనీ దగ్గర నుంచి పెందుర్తికి తీసుకువెళ్లాడని వినయ్ వివరించాడు. పెందుర్తి దగ్గర ఉన్న తిరుమల ఆస్పత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. కిడ్నీ తీసేసినట్లు చెప్పాడు. తాను ఇంటికి వచ్చాక రూ.ఐదు లక్షలు ఇచ్చారని వీడియో తీయించి.. తన తండ్రికి మాత్రం రూ.2లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. కామరాజు మిగిలిన డబ్బులు తీసుకెళ్లాడని.. రూ.8 లక్షలు ఇస్తామని.. రూ.2 లక్షల 50 వేలు మాత్రమే ఇచ్చినట్లు వినయ్ తెలిపాడు. తాను ఇప్పుడు నడవలేకపోతున్నట్లు బాధితుడు వినయ్ చెప్పాడు. కిడ్నీ ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చని భావించానని.. కానీ నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడు వినయ్‌కుమార్‌ పీఎంపాలెం స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పీఎం పాలెం పోలీసులు.. ఈ కేసును పెందుర్తి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.

*పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు.. బట్టలు విప్పి హల్ చల్
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. మద్యం తాగి నానా హంగామా సృష్టించాడు. రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ జై కొట్టాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు పిల్లదొరకట్లేదంటూ బూతులు తిడుతూ రోడ్డుపై బట్టలు విప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. అక్కడే వున్న అంబేద్కర్ విగ్రహం ఎక్కి జై అంటూ నినాదాలు చేశాడు. రోడ్డు పడుకుని దండాలు పెడుతూ నానా హంగామా చేశాడు. మద్యం మత్తులో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితి. దీంతో స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం మత్తులో వున్న వ్యక్తిని కంట్రోల్‌ చేసేందుకు నానా కష్టాలు పడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌ పట్టణంలో చోటుచేసుకుంది.మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారి 44 పై అర్థరాత్రి ఓ వ్యక్తి మద్యం మత్తులో బట్టలు విప్పేసి హల్చల్ చేశాడు. రహదారిపై పడుకొని వాహనాలను అడ్డుకుంటూ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి అని నినాదాలు చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందికి గురిచేశాడు. స్థానిక సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్నారు పోలీసులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం లెక్కచేయకుండా చౌరస్తా దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎక్కి జై అంబేద్కర్.. జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశాడు. తనకు పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు అంటూ బూతులు తిడుతూ రోడ్డుపై హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని మేడ్చల్ పోలీసులు కంట్రోల్‌ చేసేందుకు చమటలు పట్టాయి. అయినా పోలీసులు సహనంతో అతన్ని ఎవరు నువ్వు? నీ పేరు ఏంటి? సమాచారం సేకరించి కుటుంబ సభ్యులను అప్పగించారు.

*ఏఐఏడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు.. 2024 ఎన్నికలపై చర్చ!
తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఏంకే, బీజేపీ మధ్య వివాదంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోదని ప్రచారం జరుగుతోంది. ఏఐఏడీఎంకే-బీజేపీ మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమికి కూటమికి బీటలువారనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశం అయినట్లు సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగించేందుకు అన్నాడీఎంకే సుముఖత వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైనట్లు రెండు పార్టీల మధ్య తలెత్తిన వివాదంపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై కూడా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్త కొనసాగించాలని ప్రధానంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం కూడా తమిళనాడులో పొత్తు కొనసాగాలని కోరుకుంటున్నామని నొక్కి చెప్పింది. గత ఎన్నికల మాదిరిగానే చివరి నిమిషంలో గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు బీజేపీ పోటీ చేసే స్థానాలపై కూడా సమావేశంలో చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్నామలై అన్నామలై ఏఐఏడీఎంకేతో పొత్తును బీజేపీ రద్దు చేసుకోకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానన్న నిర్ద్వంద్వ వైఖరి రెండు పార్టీల శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించింది. కూటమిలో కొనసాగాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించుకుంటే పార్టీ రాష్ట్ర చీఫ్‌ పదవికి రాజీనామా చేస్తానని అన్నామలై బెదిరించారు. అయితే, తాను కార్యక్తగా కొనసాగుతానని చెప్పారు. తమిళనాడులో రెండో సారి కూడా బీజేపీ ఎదగదని అన్నామలై అభిప్రాయపడ్డారు.

*రిజర్వేషన్ పరిమితి పెంపు హామీ సాధ్యమేనా?
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఓటమి దిశగా పయనిస్తోందని చెప్పారు. సిద్దరామయ్య ఘోరంగా ఓడిపోతాడు కాబట్టి, రాష్ట్రంలో రిజర్వేషన్ పరిమితిని పెంచే ప్రశ్న తలెత్తదని యడియూరప్ప అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేం (బీజేపీ) మా శక్తి మేరకు అన్నీ చేస్తామని చెప్పారు. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వస్తే ముఖ్యమంత్రి పదవిపై దృష్టి సారించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. జనాభా ఆధారంగా రిజర్వేషన్ పరిమితిని 50 శాతం నుండి 75 శాతానికి పెంచడానికి, అన్ని కులాలకు రిజర్వేషన్లను విస్తరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి షెట్టర్, గతంలో డిప్యూటీ సిఎంగా పనిచేసిన సవాడి లింగాయత్ వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. బిజెపిని విడిచిపెట్టిన ఇద్దరిపై యెడియూరప్ప మాట్లాడుతూ ప్రభుత్వంలో కీలకమైన శాఖలు అప్పగించినప్పటికీ, బిజెపికి ద్రోహం చేసినందున, లక్ష్మణ్ సవాది, జగదీష్ షెట్టర్‌లకు ఒక్క ఓటు కూడా వేయవద్దని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు నేతలు ఓడిపోతారని నాకు 100 శాతం నమ్మకం ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, మే 10న ఒకే దశలో 224 స్థానాలకు ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడికానున్నాయి.

*చైనా సరిహద్దులో భారీ ప్రాజెక్టులకు భారత్ ప్లాన్!
భారత్, చైనా మధ్య సరిహద్దులో వివాదం కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌కు భారీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ( LAC) వరకు భారీ పరికరాలను రవాణా చేయగల రోడ్డు, రైలు మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది LAC సమీపంలోని కీలకమైన వ్యూహాత్మక, మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రోడ్డు, రైలు మార్గాలపై పనిని వేగవంతం చేస్తుంది. విశ్వనీయ వర్గాల ప్రకారం రోడ్ల నెట్‌వర్క్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌ను అనుసంధానించే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులుకు కేంద్రం దృష్టి పెట్టింది. సెలా టన్నెల్ రోడ్ ప్రాజెక్ట్ – తవాంగ్‌ని అస్సాంలోని గౌహతికి అనుసంధానించడానికి నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌లో 1,555 మీటర్ల పొడవున్న ప్రధాన, నిష్క్రమణ సొరంగాలు ఉన్నాయి. 980 మీటర్ల చిన్న సొరంగం, దాదాపు 1.2 కి.మీ రహదారితో పాటు చైనీయులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షించలేరు. సెలా పాస్ ప్రస్తుతం చైనీయులకు కనిపిస్తుంది. ఇది హై డెఫినిషన్ రాడార్, మైక్రోస్కోపిక్ బైనాక్యులర్ల ద్వారా సెలా పాస్ మీదుగా భారీ ఫిరంగి లేదా పదాతిదళ కదలికలను ట్రాక్ చేయడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం, అరుణాచల్‌లోని తవాంగ్ చేరుకోవడానికి బలిపరా-చరిదూర్ రోడ్డు (అస్సాం)ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో సెలా పాస్ మూసివేయబడుతుంది. సొరంగం సెలా పాయింట్‌కి చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఇరుకైన దారులను దాటవేస్తుంది. అయితే బైసాఖిని నురానాంగ్‌కు కలుపుతుంది. టన్నెల్ రహదారి ప్రయాణాన్ని 8 కిలోమీటర్లు తగ్గిస్తుంది. తవాంగ్‌కు రహదారి యాక్సెస్‌ను నిర్ధారించడానికి ప్రయాణ సమయాన్ని 90 నిమిషాలు తగ్గిస్తుంది. ప్రస్తుతం, గౌహతి నుండి తవాంగ్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి దాదాపు 12-13 గంటల సమయం పడుతుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) జూలై 2023 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. నెచిఫు టన్నెల్ సిద్ధంగా ఉంది. యాక్సెస్ రోడ్డుతో సెలా కోసం సొరంగం ఈ సమయంలో సగం పూర్తయింది. కానీ వర్షం, తుఫాను వాతావరణం పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉన్నందున గడువును పొడిగించే అవకాశం ఉంది. గతంలో చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన ఈ ప్రాజెక్ట్, అరుణాచల్ ప్రదేశ్ ఉత్తర సరిహద్దులో మెక్‌మాన్ రేఖను అనుసరించే 2,000-కిమీ పొడవైన రహదారి.

*బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌లపై మధుబాల సంచలన వ్యాఖ్యలు
రోజా సినిమాతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే నటి మధుబాల. సినీ ఇండస్ట్రీలో మధు అంటే పెద్దగా తెలియాదు. మధుబాల అంటు ఠక్కున గుర్తుకు వస్తుంది. మధునే ఆమె అసలుపేరు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె తన మధుబాలగా స్ర్కీన్ నేమ్ పెట్టుకుంది. ఒట్టాయల్ పట్టాలమ్ అనే మలయాళ చిత్రంతో ఆమె తెరంగేట్రం చేసింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా’ ఆమెకు నటిగా ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మధుబాల ఇప్పటివరకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించారు. తాజాగా శాకుంతలం సినిమాపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శాకుంతలం సినిమాలో సమంత మేనక పాత్రలో నటించింది. భారీ అంచనాలతో ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంపై తొలిసారిగా మధు స్పందించింది. శాకుంతలం సినిమ ఫెయిల్యూర్ కావడం బాధించిందన్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత సీజీఐ కోసమే ఏడాది పాటు కష్టపడ్డారని తెలిపారు. ప్రేక్షకులకు మంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నారు. షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఎలాంటి ఒత్తిడి లేదు. టాలీవుడ్‌లో బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. వారి విజయానికి సరైన కారణం లేదు. అవి ఎలా హిట్ అయ్యాయో అర్థం కావడం లేదు. మా సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇంత నిరాశకు గురి చేస్తుందని అనుకోలేదు.’ అన్నారు. ఇదిలా ఉంటే అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా తీశారు. ఈ చిత్రంలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version