*కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు వారు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక,రాహుల్ గాంధీ, ఏడు రాష్ట్రాల సీఎంలు హాజరు అయ్యారు.
*ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. కాగా, తల్లి అనారోగ్యం కారణంగా అవినాష్‌రెడ్డి.. ఆసుపత్రిలోనే ఉన్న విషయం తెలిసిందే. కాగా నిజానికి మే 19న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్ కూడా చేరుకున్నారు. చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు. వెంటనే కారులో పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, అవినాష్ రెడ్డి తన కాన్వాయ్‌ను వెనక్కి తిప్పారు. అవినాశ్‌రెడ్డి మాతృమూర్తి తీవ్ర అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ ఎంజైమ్స్ సాధారణం కంటే ఎక్కువ ఉండటంతో ఆమె ఆరోగ్యం విషమించింది. వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్ కూడా కర్నూలులోనే ఉన్నారు. అవినాష్ రెడ్డి దగ్గరుండి తల్లి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరు కావాలంటూ వాట్సాప్ ద్వారా అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు పంపించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
*ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఏపీలో పాలిసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం 10.45 నిమిషాలకు విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. https://polycetap.nic.in వెబ్ సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా.. 1,43,592 మంది పరీక్షకు హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక పాలిసెట్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు. పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా – గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
*తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ రేట్లు
వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా, వారం రోజులుగా ఎండలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వాతావరణంలో హెచ్చుతగ్గుల కారణంగా కోళ్లు చనిపోతుండటంతో దీని ప్రభావం చికెన్ ధరలపై చూపుతుంది. కేవలం నెల రోజుల్లోనే చికెన్ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 1న కేజీ చికెన్ ధర రూ.154 ఉండగా, ప్రస్తుతం రూ.200కి చేరింది. శుక్రవారం మార్కెట్‌లో స్కిన్‌తో కూడిన చికెన్ కిలో రూ.213 పలుకుతోంది. కాగా స్కిన్ లెస్ చికెన్ ధర రూ. నెల క్రితం కిలో 175 ఉండగా ఇప్పుడు రూ. 243కి చేరగా.. ఏప్రిల్ 1న రూ.84 ఉన్న ఫామ్ చికెన్ గురువారం నాటికి రూ.125కి పెరిగింది. స్కిన్‌తో కూడిన చికెన్ ధర ఏప్రిల్ 1న రూ.154, ఏప్రిల్ 15న రూ.175, మే 1న రూ.186, మే 18న రూ.213కి పెరగగా.. స్కిన్‌లెన్ చికెన్ కేజీ ధర ఏప్రిల్‌లో రూ.175గా ఉంది. ఏప్రిల్ 15న రూ.200, మే 1న రూ.211, మే 18న రూ.243. ఫామ్ చికెన్ ధర ఏప్రిల్ 1న రూ.84, ఏప్రిల్ 15న రూ.95, మే 1న రూ.106, మే 1న రూ. మే 18న రూ.124కి చేరగా.. వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా 40 నుంచి 60 శాతం కోడిపిల్లలు చనిపోతాయని, చికెన్ ధరలు పెరగడానికి ఇదే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కోళ్ల దాణా, రవాణా ఖర్చు కూడా భారీగా పెరిగిందని, అది కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు. ప్రతి ఏటా ఎండాకాలంలో చికెన్ ధరలు పెరుగుతాయి. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని అంటున్నారు. చికెన్ ధరలు క్రమంగా పెరగడంతో నాన్ వెజ్ ప్రియులు హర్షం వ్యక్తం చేయడం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్ షాపుల ముందు నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మిగతా రోజుల్లో కూడా నాన్ వెజ్ అమ్మకాలు భారీగానే ఉన్నాయి. ఇప్పుడు చికెన్ ధరలు భారీగా పెరగడంతో కొంత మంది తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. రేట్లు ఎక్కువగా ఉండడంతో సామాన్యులు సైతం కోడి కొనుగోళ్లకు వెనకడుగు వేస్తుంటే.. మరి కొంతమంది చికెన్ ప్రియులు మాత్రం గత్యంతరం లేక కొనుగోలు చేస్తున్నారు.
*కదంతొక్కిన కందిపప్పు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్..!
దేశంలో పప్పుల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ పరిణామం పేద కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోంది. పప్పుధాన్యాలు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే రేషన్‌కార్డుల్లో ఇవ్వడంతో ఇతర ప్రాంతాల వారికి వాటిని కొనడం కష్టంగా ఉంది. ఇప్పుడు పప్పుల ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా పప్పులు సరఫరా కాకపోవడంతో సూపర్‌మార్కెట్లతోపాటు కిరాణా దుకాణాల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కందిపప్పును కాస్తోకూస్తో అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో రూ. రూ.140కి పెరిగిన ధర రూ.180కి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వేసవిలో కందిపప్పు వినియోగం కొంతమేర తగ్గుతుందని, రానున్న వర్షాకాలం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు సరిపడా సరఫరా కాకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో రెండు నెలల క్రితం వరకు రూ. 100 నుంచి రూ. 103, కందిపప్పు ఇప్పుడు రిటైల్ రూ. 140 వరకు పలుకగా.. గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల పప్పుధాన్యాలు పండగా మరో 15 లక్షల టన్నులు దిగుమతి అయ్యాయి. అయితే ఈ ఏడాది దిగుబడి 38.9 లక్షల టన్నులు దాటలేదు. దీనికి తోడు దిగుమతి విషయంలో కేంద్రం అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కేంద్రం పప్పు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.6,600గా ప్రకటించింది. కానీ ప్రస్తుతానికి క్వింటాల్ పప్పులు రూ. 10 నుంచి రూ. 12 పలుకుతుంది. ఇటీవల ఏప్రిల్ 3న కిలో పప్పు ధర 120 నుంచి 130 రూపాయలకు పెరిగిన విషయం తెలిసిందే. మినపగుండ్లు కూడా 130 నుంచి 140 రూపాయలకు చేరింది. ఈ రెండు నెలల్లోనే చిల్లర వ్యాపారులు కిలోకు రూ.10 అదనంగా పెంచారు. ప్రధానంగా పప్పుల కొరత ధరల పెరుగుదలకు కారణం. దీనికి తోడు డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు రాబట్టుకునేందుకు వ్యాపారులు కొన్ని ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పప్పుల దిగుబడి గణనీయంగా తగ్గడం ధరలపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా రైతులు యాసంగి కందులను ఫిబ్రవరి నుంచి వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి తీసుకువస్తారు. కానీ, కందులు, పెసలు, మినుము దిగుబడులు తగ్గడంతో మార్కెట్లకు సరిగా చేరడం లేదు. దీంతో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేందుకు పప్పుధాన్యాలను అక్రమంగా నిల్వ ఉంచితే సహించేది లేదని కేంద్రం ఇటీవల హోల్ సేల్ వ్యాపారులను హెచ్చరించింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం 12 లక్షల టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఒక్క డిసెంబర్‌లోనే 2 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నాం. గత జూలై నుండి డిసెంబర్ వరకు భారీ వర్షాలు దేశంలో పప్పుధాన్యాల దిగుబడిని తగ్గించాయి.
*తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం..
తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి గుంటూరు వెళుతుండగా.. అర్ధరాత్రి ఒక్కసారిగా బోగీల్లోకి చొరబడి రెచ్చిపోయారు. ప్రయాణికులను బెదిరించి అందినకాడికి దోచుకున్నారు. శుక్రవారం రాత్రి రైలు తిరుపతిలో రాత్రి 7.30 గంటలకు బయల్దేరాల్సి ఉంది.. కానీ ఓ గంట ఆలస్యంగా కదిలింది. అలా కడప జిల్లా కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత ఓ సిమెంటు పరిశ్రమ సమీపంలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఆగింది. రైలు ఆగిన తర్వాత 20 నుంచి 25 మంది వరకు దుండగులు వచ్చారు. ఆ దొంగలు ఒక్కసారిగా ఎస్1 నుంచి ఎస్6 వరకు ఉన్న బోగీల్లో కిటీకీల పక్కన ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోయారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల బంగారు ఆభరణాలు లాక్కుని దుండగులు పారిపోయారు. రైల్లో కొందరు ప్రయాణికులు ప్రతిఘటించే యత్నం చేయగా వారిపై ఆ దుండగులు దాడులు చేశారు. ఎస్3 బోగీలో నలుగురు మహిళల బంగారు ఆభరణాలు లాక్కెళ్లేందుకు దుండగులు ప్రయత్నించగా.. ముగ్గురు ప్రతిఘటించినట్లు చెబుతున్నారు. దీంతో ఒకరి మెడలో మాత్రం బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు చెప్పారు. రైలు ఎర్రగుంట్ల రైలు నిలయానికి చేరుకున్న అనంతరం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలుకు గస్తీ నిర్వహించాల్సిన పోలీసులు తిరుపతి నుంచి ఎర్రగుంట్ల వరకు ఎవరూ ఉండరని.. ఎర్రగుంట్ల నుంచి గుంటూరు వరకు పోలీసు భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలిసే ఎర్రగుంట్ల ముందు రైలును నిలిపి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏకంగా 20 నుంచి 25 మంది దొంగలు దోపిడీకి రావడం కలకలం సృష్టించింది. పక్కా ప్లాన్ ప్రకారం చోరీగా పాల్పడ్డారా అనే అనునాలు రేకెత్తుతున్నాయి. గతంలో కూడా రైళ్లలో దోపిడీలు జరిగాయి. రైల్వే పోలీసులతో భద్రతను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
*కట్నం తీసుకుంటే కటకటాలకేనా?
ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కట్నకానుకల వల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి కూతుళ్లకు పెళ్లిళ్లు చేయాల్సి వస్తోంది. నగదుతోపాటు బంగారం, అనుకున్న వస్తువులు, భూములు, వాహనం రూపంలో కూడా అల్లుడికి సమర్పించాలి. పెళ్లి విషయానికి వస్తే కట్నం ఎంత అని అడగడం పరిపాటిగా మారింది. కొంతమంది వరులు చాలా గట్టిగా కట్నం డిమాండ్ చేస్తారు. వరుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడంటే చాలు.. భూములు అమ్ముకోవాల్సి వస్తోంది. అంతే.. పెళ్లయిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం వేధిస్తే.. తట్టుకోలేక వివాహితలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చిన ఈ వరకట్నం విషయంలో మాత్రం పాత సంప్రదాయాలే కొనసాగుతుండటం బాధాకరం. ఇవ్వగలిగిన వారి పరిస్థితి అలా ఉంచితే.. ఇవ్వలేని వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. వరకట్నాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినా.. వాటిని పాటించే వారు తక్కువే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వరకట్న సంప్రదాయానికి చరమగీతం పాడేలా కీలక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. వరకట్నం విషయంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరకట్నం తీసుకునే వరుడి పట్టా రద్దు విధానాన్ని కేరళ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం కేరళలో ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేరళలోని వరకట్న వ్యతిరేక విధానాన్ని హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీనియర్ లెక్చరర్ శ్రీనివాస్ మాధవ్ అధ్యయనం చేశారు. కేరళలో వరకట్న వ్యతిరేక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడి విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో… ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేస్తే… మంచి ఫలితాలు వస్తాయని ఆలోచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఇదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌కు ప్రతిపాదనలు కూడా సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనకు అవసరమైన ప్రోటోకాల్‌లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఉన్నత విద్యామండలి, మహిళా శిశు సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వరకట్నం తీసుకుంటే పట్టా రద్దు విధానాన్ని అమల్లోకి తెస్తే ఇలాంటి సంప్రదాయానికి పూర్తిగా స్వస్తి పలకాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
*అమెరికా ప్రముఖులపై రష్యా నిషేధం.. మాజీ అధ్యక్షుడు ఒబామాతో సహా
అమెరికా-రష్యాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలకు సంబంధించి అమెరికా.. రష్యాపై అంక్షలను విధించింది. దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్ మాజీ అధ్యక్షులు సహా పలువురు ప్రముఖులపై ఆంక్షలు విధించింది. అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా రష్యా 500 మంది ప్రముఖ అమెరికన్లపై నిషేధం విధించింది. వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఉన్నారని సమాచారం. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం విధించిన రష్యా వ్యతిరేక ఆంక్షలకు ప్రతిస్పందనగా అమెరికా కార్యనిర్వాహక శాఖకు చెందిన పలువురు సీనియర్ సభ్యులతో సహా 500 మంది అమెరికన్లను దేశంలోకి రానివ్వకుండా నిషేధిస్తున్నామంటూ రష్యా ప్రకటించింది. ఈ జాబితాలో ఆ దేశ మాజీ అధ్యక్షులు ఒబామాతో పాటు అమెరికా మాజీ రాయబారి జాన్ హంట్స్ మన్, పలువురు అమెరికా సెనేటర్లు, జాయింట్ చీఫ్స్ తదుపరి చైర్మన్ చార్లెస్ క్యూ బ్రౌన్ జూనియర్ కూడా ఉన్నారు. ప్రముఖ అమెరికన్ లేట్ నైట్ టీవీ షో హోస్ట్ లు జిమ్మీ కిమ్మెల్, కోల్బర్ట్, సేథ్ మేయర్స్ లను కూడా దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధించింది.
*పాపం.. రవితేజకు ఆకలి కాదా.. అందుకే అలా అవుతున్నారా ?
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంచలంచెలుగా మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసుకుంటా వెళ్తుంటారు మాస్ రాజా రవితేజ. ఆయన తరహా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాలంటే ఇష్టపడే ప్రత్యేక అభిమానులున్నారు. కిక్కు, రాజా ది గ్రేట్, ఇడియట్, కృష్ణ, దరువు, ధమాకా, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈయన కామెడీ టైమింగ్ కి చాలా మంది అభిమానులు పడి పడి నవ్వుకున్నారు. కెరీర్లో ఎంత ఎదిగినా ఆయనలో ఇసుమంత గర్వం కనిపించదు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇటీవల ఆయన నటించిన రావణాసుర సినిమా అంతగా హిట్ అవ్వలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో రవితేజ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. అదేంటంటే రవితేజ ప్రస్తుతం ఒక వ్యాధితో బాధపడతున్నారట. ఈ క్రమంలోనే ఆయనకి ఉన్న వ్యాధిని బయటపెడుతున్నారు. మరి అంతా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటారు రవితేజ. అలాంటి ఆయనకు ఆ వ్యాధి అంటే ఆశ్యర్యం కలుగుతుంది కదూ.. నిజానికి చాలామంది హీరోలు 50,60ఏళ్లు దాటినా వారి మొహంలో ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, మహేష్ బాబు ఈ కోవలోకి వచ్చేవారే. వారి ఏజ్ విషయంలో అస్సలు బయటపడరు. అదే కోవలో రవితేజ కూడా 50 ప్లస్ లోనే ఉన్నారు. కానీ ఆయన మొహం, బాడీ చాలా స్ట్రింక్ అయి స్కిన్ని అవ్వడంతో చాలామంది రవితేజ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అంటూ భావిస్తున్నారు. అవును నిజంగానే రవితేజ ఆకలి లేని ల్యూక్ వ్యాధితో బాధపడుతున్నారట. ఈ ల్యూక్ వ్యాధి వల్ల రవితేజకు ఎక్కువగా ఆకలి వేయకపోవడంతో ఆయన ఫేస్, స్కిన్ మొత్తం డల్లుగా అయిపోయిం చర్మం సాగినట్లుగా కనిపిస్తుందట.
