*చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ములాఖత్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్ ములాఖత్ అయ్యారు. చంద్రబాబును పరామర్శించి, అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. దాదాపు 40 నిమిషాల పాటు ములాఖత్ ఉండే అవకాశం ఉంది. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. పవన్‌కళ్యాణ్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే ముందు టీడీపీ క్యాంప్ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు భార్య భువనేశ్వరితో కొద్దిసేపు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. ఆరు వాహనాల కాన్వాయ్‌తో పవన్ కళ్యాణ్ జైలు వద్దకు చేరుకోగా.. ఆరు వద్దు, ఒక కారు సరిపోతుందని అధికారులు సూచించారు. పవన్ వెంట జైల్లోకి వెళ్లేందుకు జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ప్రయత్నించగా.. ఇష్టానుసారంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంపై అధికారుల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు జనసేన నాయకులు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండడంతో ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. నలుగురికి మించి ఉండకూడదని, ర్యాలీలు, నిరసనలకు అనుమతి నిబంధనలు అమలులో ఉంది. ములాఖత్ తర్వాత నేరుగా రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ పవన్ వెళ్లనున్నారు.
*ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన కార్మికులు
టీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను గవర్నర్ అభినందించారు. నెల రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫార్సులపై ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలకు పైగా కార్పొరేషన్‌గా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో 43 వేల 373 మంది ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో కేసీఆర్ వెలుగు నింపారు. నెల రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక నెరవేరింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కరోనా కారణంగా ఆర్టీసీ నష్టాలను మూటగట్టుకుని లాభాలను ఆర్జిస్తోంది. అయినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. వేలాది మంది ఉద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీని ఆదుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చుతూ ప్రజల హృదయాల్లో ఆత్మీయ చిరునామాగా నిలిచిన ఆర్టీసీకి నివాళి. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సమ్మెలో సకల జనులు పాల్గొన్నారు. వారి కుటుంబాలు, జీతాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమం ఊపిరి పీల్చుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్, వేతనాలు పెంచారు. ఇతర సౌకర్యాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు.
*దీక్ష విరమించిన కిషన్ రెడ్డి
నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్ష చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను భగ్నం చేశారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై బుధవారం ఇందిరాపార్కు వద్ద 24 గంటల దీక్షను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అయితే సాయంత్రం 6 గంటలకు పోలీసులు రంగంలోకి దిగారు. దీక్షా ప్రాంగణాన్ని చుట్టుముట్టి కిషన్ రెడ్డిని బలవంతంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ధర్నా చౌక్ వద్ద తోపులాట జరిగింది. అయితే ఈ గొడవలో కిషన్ రెడ్డి చేతికి, ఛాతీకి గాయాలు కావడంతో అక్కడికి వచ్చిన వైద్యులు పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ధర్నాచౌక్ వద్దకు చేరుకుని నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి సాహసోపేత నిర్ణయాన్ని అభినందిస్తున్నా. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. బీజేపీ సత్తా ఏంటో ఇప్పటికే కేసీఆర్ కు వివిధ సందర్భాల్లో చాటిచెప్పిందన్నారు. కిషన్ రెడ్డి బుధవారం శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అయితే శాంతియుతంగా ధర్నా చేసినా.. సమస్య ఏమిటో కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే పోలీసులను పంపి దీక్ష భగ్నం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణ యువతను మోసం చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసునని విమర్శించారు. యువత కేసీఆర్ ను గద్దె దించాలని.. తెలంగాణ బతకాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం ఉందని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఉద్యమాన్ని కొనసాగిద్దాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ చెప్పడంతో ఎన్నికలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా లేక కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
*బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
అల్పపీడనం కారణంగా నేడు, రేపు తూర్పు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. నేడు 13 జిల్లాకు ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది. అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ కు నేడు, రేపు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్ కి ఎల్లో అలెర్ట్ ఐఎండీ వెల్లడించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయి. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 6-8 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, జియ్యమ్మవలస ప్రాంతాల్లో అత్యధికంగా 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
*బీహార్‌లో ఘోరం.. 33 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా
బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 33 మంది పిల్లలతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటన గురువారం రోజున ముజఫర్ పూర్ జిల్లాలో జరిగింది. బాగ్‌మతి నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. విషయం తెలిసిన వెంటనే ఎస్డీఆఫ్ఎఫ్ బలగాలు రెస్య్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 17 మంది చిన్నారులను రక్షించగా.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. సీఎం నితీష్ కుమార్ పర్యటన నేపథ్యంలో ఈ పెను ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 17 మంది పిల్లల్ని రక్షించగా.. 16 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరి కోసం డైవర్లు గాలిస్తున్నారు. పిల్లలతో నిండిన పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. డైవర్లతో పాటు స్థానికంగా ఉన్న గ్రామస్తులు సహాయక చర్యలను ప్రారంభించారు. గైఘాట్‌లోని బెనియాబాద్ ఓపీ ప్రాంతంలోని మధుపట్టి ఘాట్ వద్ద పడవ బోల్తా పడిన ప్రమాదం జరిగినట్లు సమాచారం. పడవలో దాదాపు 33 మంది చిన్నారులు ఉన్నారు. బ్యాలెన్స్ కోల్పోవడంతో బోటు నదిలో బోల్తా పడినట్లు తెలుస్తోంది. గైఘాట్, బెనియాబాద్ పోలీసులతో పాటు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలంలో చర్యలు ప్రారంభించిందని జిల్లాకు చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు.పిల్లలు పడవలో స్కూలుకు వెళ్తున్నారని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పిల్లల కుటుంబ సభ్యులు నది వైపు పరుగులు తీశారు. చిన్నారులను రక్షించేందుకు గ్రామస్తులు నదిలోకి దూకారు. దీంతో చాలా మంది పిల్లల్ని కాపాడగలిగారు. ఘటనా ప్రాంతంలో పిల్లల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ముజఫర్‌పూర్ లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఈ రోజు సీఎం నితీష్ కుమార్ వస్తున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. పడవ బోల్తా విషయాన్ని స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలు కావడానికి ఆలస్యమైందని ఆరోపించారు.
*చికెన్ ఇవ్వలేదని షాప్ యజమాని బుర్రపగులగొట్టి పరారైన యువకులు
తమ స్నేహితులతో కలిసి చికెన్ తినేందుకు వెళ్లిన కొందరు యువకులు షాపు యజమానిని కొట్టిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వారు తందూరి ముర్గా (డిష్)ని ఆర్డర్ చేశారు. కానీ దుకాణ యజమాని దానిని వడ్డించడానికి నిరాకరించడంతో కోపోద్రిక్తులైన యువకులు అరుపులు, అల్లర్లు ప్రారంభించారు. ఆ తర్వాత షాపు యజమానిని కూడా కొట్టినట్లు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు యజమానిని కూడా కారులో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కొందరు యువకులు కారులో నగరంలోని పంజాబీ చికెన్ సెంటర్‌కు వచ్చారు. తందూరీ చికెన్ డిష్ ఆర్డర్ చేసి కారులో తాగడం మొదలుపెట్టారు. అయితే షాపు ముందు మద్యం సేవించవద్దని దుకాణం యజమాని చెప్పడంతో తిట్టడం మొదలుపెట్టారు. చివరకు చికెన్ సెంటర్ యజమాని చికెన్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు అరుపులు, వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే తలపై మద్యం సీసా పగలగొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దుకాణ యజమానిని ఆస్పత్రికి తరలించగా తలపై ఎనిమిది గాట్లుపడ్డాయి. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు. చికెన్ సెంటర్ యజమాని అల్లరిమూకలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు తోపులాటకు దిగారు. ఈ గొడవలో నిందితుడు బీరు బాటిల్‌తో తలపై కొట్టి బలవంతంగా కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అయితే అతడు విఫలం కావడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
*సైమా స్టేజ్ పైన కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైమా స్టేజ్ పైన రెండో సరి కాలర్ ఎగరేసాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ తెలుగు కేటగిరిలో అవార్డ్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని కొమురం భీమ్ పాత్రలో చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కి సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని ఎన్టీఆర్ గెలుచుకున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కొమురం భీమ్ క్యారెక్టర్ ని జక్కన ఏ టైమ్ లో ఎన్టీఆర్ తో చేయించాడో కానీ ఈ ఒక్క క్యారెక్టర్ ఎన్టీఆర్ ని గ్లోబల్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకే సీన్ కి, గాల్లోకి బండిని ఎత్తి ఫైట్ సీన్ కి, కొమురం భీముడో సాంగ్ కి ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా ఎగ్జైట్ అయ్యారు. బౌండరీలని దాటి అభిమానులని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి సైమా అవార్డు రావడం నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. సెప్టెంబర్ 15-16 డేట్స్ లో సైమా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కోసమే దేవర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడు. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ వెళ్లాడు అంటే బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకోని ఉంటాడు అనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్, నిఖిల్ సిద్దార్థ్, అడవి శేష్, దుల్కర్ సల్మాన్ లు బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఎన్టీఆర్ తో పోటీ పడుతున్నారు.
*తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సైతం సినిమాలు నిర్మించిన బాలీవుడ్ నిర్మాత ముఖేష్ ఉదేషి కన్నుమూశారు. ఇక పరిశ్రమ ఆ రెండు షాకింగ్ న్యూస్ ల నుండి ఇంకా కోలుకోకుండానే మరో నిర్మాత కన్నుమూసినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు నిర్మించిన ఒకప్పటి ప్రముఖ నిర్మాత గోగినేని ప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. నిర్మాత గోగినేని ప్రసాద్ ఈ చరిత్ర ఏ సిరాతో, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం”, నందమూరి బాలకృష్ణతో “పల్నాటి పులి” వంటి సినిమాలు నిర్మించారు. అయితే వయోభారం రీత్యా గత కొంత కాలంగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన వయసు 73 సంవత్సరాలు కాగా హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారు తెలిపారు. గోగినేని ప్రసాద్ కు ఒక కుమారుడు ఉండగా ఆయన అమెరికాలో స్థిరపడినట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇక గోగినేని ప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
