NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

*ప్రమాదానికి కారణం ఇదే.. కీలక విషయాలు వెల్లడించిన రైల్వే మంత్రి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మందికి పైగా చనిపోగా 1100 మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. యావత్ దేశాన్ని కలవరపరిచిన ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం హై లెవల్ కమిషన్ వేసింది. అలాగే ట్రాక్ మరమ్మత్తు పనులను శరవేగంగా చేపడుతున్నారు. మంగళవారం ఉదయం వరకు పనులు పూర్తి చేసి యదావిధిగా రైళ్లు నడిచే విధంగా చూస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని.. బాధ్యులను గుర్తించినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. అలాగే మూడు రైళ్లు ఢీ కొనడానికి గల మూలకారణాన్ని గుర్తించామని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని అన్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ దీనిపై విచారణ జరిపారని కేంద్ర మంత్రి తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుకు సంబంధించిన సంఘటన జరిగిందని, దీనికి కవాచ్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే దీనికి బాధ్యులను కూడా గుర్తించారన్నారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం పునరుద్ధరణ చర్యలపైనే ఉందన్నారు. బుధవారం ఉదయానికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈరోజు రైలు పట్టాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామన్నారు. మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు తెలిపారు.

 

*సీఎం జగన్‌ పోలవరం పర్యటనకు ముహూర్తం ఫిక్స్
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు పోలవరం ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్శన సందర్భంగా పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పడర్ కాఫర్ డ్యామ్‌లను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించనున్నారు. స్పిల్‌వే, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్‌ డ్యామ్ ప్రాంతాలను జగన్‌ సందర్శించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ప్రాజెక్ట్ వద్ద జలవనరులశాఖ అధికారులు, ఇంజినీర్లతో సీఎం సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి తెలుసుకోనున్నారు. వేగంగా పనులు చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే జగన్ పర్యటన క్రమంలో శనివారం పోలవరంను జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై జలవనరులశాఖ అధికారులతో మంత్రి అంబటి రాంబాబు సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డయాఫ్రం వాల్ దగ్గర గోతుల్లో ఇసుక నింపే పనులను అంబటి పరిశీలించారు. ఇటీవల ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం పనులను త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జాప్యం జరగడానికి గల కారణాలను అధికారులు వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం రూ.17 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని ఏపీ అధికారులు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నిధులను విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

*గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లు విడుదల
జూన్ 11న జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్స్ ను ఇవాళ విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిసన్ ( TSPSC ) ప్రకటించింది. హాల్ టికెట్లు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అక్టోబర్ 16, 2022న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం ముందుగా జారీ చేయబడిన హాల్ టిక్కెట్లు, తరువాత రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఆ తరువాత జూన్ 11న జరగబోయే పరీక్షకు చెల్లుబాటు కావని వెల్లడించింది. కాగా అభ్యర్థులు కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల కోసం 3 లక్షల 80 వేల 202 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు. అయితే వెబ్‌సైట్‌లో నమూనా ఓఎంఆర్‌ షీట్‌ అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.

 

*మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ ఆకస్మికంగా మృతి చెందారు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా సుదర్శన్ కొనసాగుతున్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి.. గెరిల్లా వార్‌లో మంచి దిట్టగా పేరుపొందారు. మే 31వ తేదీన చత్తీస్ గఢ్‌లోని దండకారణ్యంలో సుదర్శన్ గుండె పోటుతో మరణించినట్టు కేంద్ర కమిటి ప్రకటించింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం కటకం సుదర్శన్ ఉద్యమంలోకి వెళ్లారు.

 

*నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక భేటీ.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పొత్తులపై క్లారిటీ తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్దమవుతున్నారని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం గత ఏడాదిగా జోరుగా నడుస్తోంది. ఇటీవల ఆ ప్రచారం మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో అనూహ్యంగా చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పొత్తులపై క్లారిటీ తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్దమవుతున్నారని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం గత ఏడాదిగా జోరుగా నడుస్తోంది. ఇటీవల ఆ ప్రచారం మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో అనూహ్యంగా చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. శనివారం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ భేటీ జరగ్గా.. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. విభజన హామీలను నెరవేర్చనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు 2018లో ఎన్డీఏ నుంచి వైదొలిగాక తొలిసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం కీలకంగా మారింది. పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

 

*ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బైడెన్‌ దిగ్భ్రాంతి
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ హృదయ విదారక వార్త వినగానే తన మనసు చలించిపోయిందని బైడెన్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‘‘భారత్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించిన విషాద వార్త విని నా హృదయం ముక్కలైంది. జిల్‌ బైడెన్‌ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ భయానక ఘటన తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. భారత్‌, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో మా ఆలోచనలన్నీ బాధితుల కుటుంబాలపైనే ఉన్నాయి’’ అని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ అన్నారు.

 

*దేవుడిని తిట్టిన యువకుడు.. మరణ శిక్ష వేసిన పాకిస్తాన్ కోర్టు
పాకిస్థాన్ లో నిత్యం అలజడితో ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. అక్కడ ముస్లింలదే రాజ్యం. అలాంటి దేశంలో వారి దేవుడిని విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకుంటారా.. ఆ దేవుడిని దూషించిన వారిని చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా పాకిస్థాన్ లో జరిగింది. దైవ దూషణ చేశాడని పాకిస్తాన్ లో ఓ వ్యక్తికి మరణ శిక్ష పడింది. దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు, దైవ దూషణ చేశాడనే ఆరోపణలపై ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్తాన్ కోర్టు శుక్రవారం మరణ శిక్ష విధించింది. లాహోర్ కు 400 కిలో మీటర్ల దూరంలోని బహవల్ పూర్ లో ఇస్లామ్ కాలనీకి చెందిన 19 ఏళ్ల నౌమాన్ మసేహ దైవాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేశాడని, అతనిపై కేసు నమోదు చేసిన అధికారులు వాట్సాప్ ద్వారా అతడు పంపిన మెస్సేజ్ లను సాక్ష్యంగా కోర్టులో ప్రవేశపెట్టారు. బహవల్ పూర్ కోర్టు కేసు విచారణ చేపట్టింది. నిందితుడిపై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో అతనికి మరణ శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు కోర్టు తీర్పు వెల్లడించింది. లాంటి తీర్పులు చెప్పడం ఇదే తొలిసారి కాదు.. ఇంతుకు ముందు కూడా ఓ క్రిస్టియన్ మహిళ దైవ దైషణ చేసిన నేపథ్యంలో ఆమెకు సైతం ఊరి శిక్షను విధించారు. తరుచు ఇలాంటి ఘటనలు జరుగడంతో అక్కడ క్రైస్తవులు జీవించేందుకు జంకుతున్నారు. ఎవరైన దైవ దూషణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ అధికారులు హెచ్చరించారు.

 

*ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు, మహారాష్ట్ర మాజీ క్రికెటర్‌ ఉత్కర్ష పవార్‌ను రుతు గైక్వాడ్ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను రుత్‌రాజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా వీరిద్దరూ తమ పెళ్లికి ముందు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ లో రుత్ రాజ్ గైక్వాడ్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి ఐపీఎల్‌-2023 చాంపియన్‌గా నిలిచిన తర్వాత సీఎస్‌కే ఆటగాళ్లు తమ భాగస్వాములతో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సమయంలో రుతురాజ్‌ కూడా ఉత్కర్షతో కలిసి ఫోటోలు దిగాడు. అనంతరం సీఎస్‌కే కెప్టెన్‌ ధోనితో కూడా ఫోటో దిగడంతో ఈ జంట వార్తల్లో నిలిచింది. కాగా రుతురాజ్ గైక్వాడ్ మాదిరే ఉత్కర్ష సైతం క్రికెటర్‌ కావడం విశేషం.ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పుణేలో జన్మించింది. మహారాష్ట్ర తరఫున దేశవాలీ క్రికెట్ కూడా ఆమె ఆడింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఆమె 5 వికెట్లు తీసుకుంది. క్రికెట్‌పై ఆసక్తితో ఉత్కర్ష 11 ఏళ్ల నుంచే గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం ఆమె.. పుణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ సైన్సెస్‌ విద్యను అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

 

*ప్రశాంత్ నీల్ బర్త్ డేకి ప్రభాస్ సెలబ్రేషన్స్…
KGF సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ ని కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఒక రీజనల్ సినిమాగా కూడా కన్సిడర్ చేయని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈరోజు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి, వాటిని ఆడియన్స్ ఆదరిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం ప్రశాంత్ నీల్ మాత్రమే. తెలుగు సినిమాకి రాజమౌళి, తమిళ సినిమాకి శంకర్-మణిరత్నంలు ఎంత చేసారో కన్నడ సినిమాకి ప్రశాంత్ నీల్ అంత చేసాడు. ఈ జనరేషన్ సినిమా చూసిన టాప్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. కేవలం మూడు సినిమాలతో ఇంత పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ పుట్టిన రోజుని ప్రభాస్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. సలార్ షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది, సెప్టెంబర్ 28న ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ హిస్టరీని షేక్ చేయడానికి రిలీజ్ అవుతోంది. ఈ షూటింగ్ స్పాట్ లో చిత్ర యూనిట్ అందరి మధ్య ప్రశాంత్ నీల్ బర్త్ డేని ప్రభాస్ సెలబ్రేట్ చేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో సలార్ టాగ్, ప్రశాంత్ నీల్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో ఉండడంతో ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ప్రశాంత్ నీల్ కి విషెష్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ప్రశాంత్ నీల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసారు. ఎప్పుడు బొగ్గులో ఉండే ప్రశాంత్ నీల్, ఈసారి మాత్రం కలర్ ఫుల్ లొకేషన్స్ లో కనిపించాడు. కత్తి తిప్పుతూ, ఆర్టిస్టులకి సీన్స్ అర్ధం అయ్యేలా చెప్తూ, అప్పుడప్పుడూ క్రికెట్ ఆడుతూ ప్రశాంత్ నీల్ చాలా కూల్ గా ఉన్నాడు. అంత కూల్ గా ఉంటూనే ఇండియన్ బాక్సాఫీస్ ని హీటెక్కించే సినిమాలు ఎలా చేస్తున్నాడో ప్రశాంత్ నీల్ కే తెలియాలి.