NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్ నగరం.. తెల్లవారుజామునే రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సెంట్రల్ సిటీ ఉమాన్‌లో, క్షిపణి ఒక అపార్ట్‌మెంట్ భవనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని ఆ ప్రాంతంలోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఇహోర్ టబురెట్స్ చెప్పారు.సెంట్రల్ సిటీ డ్నిప్రోలో క్షిపణి ఒక ఇంటిని ఢీకొట్టింది. ఈ దాడిలో ఓ చిన్నారి, ఓ యువతి మరణించారని మేయర్ బోరిస్ ఫిలాటోవ్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ఈ దాడిలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

‘ట్రిపులార్’ కి తిరుగులేదు.. జపాన్ లో ఇంకా హౌస్ ఫుల్’

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన RRR చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాలో ‘నాటు నాటు’ అనే పాటకి ఇటీవల ఆస్కార్ అవార్డ్ కూడా వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ కి చాలా సంవత్సరాల తర్వాత ఆస్కార్ అవార్డు రావడంతో చిత్ర యూనిట్ పై సినీ ప్రేక్షకులంతా ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ చిత్రంతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఏడాది కావస్తుంది. ఇంకా ఈ చిత్రం విడుదల సమయంలో అంతా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు కొట్టిన తర్వాత కూడా థియేటర్స్ లో రన్ ఇంకా ఆగలేదు. ముఖ్యంగా జపాన్ లో అయితే ఇప్పటికీ బుకింగ్స్ లో టాప్ 10 మూవీస్ లో ఒకటిగా RRR కొనసాగుతూ ఉంది. 200వ రోజు దగ్గరకి వస్తున్నా అక్కడ థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కొన్ని రోజుల్లో అయితే జపాన్ రన్ పై 100 రోజుల పోస్టర్ ఎలా చూసామో 200 రోజుల పోస్టర్ కూడా చూసేలా ఉన్నామని చెప్పాలి.

మోడల్ క్రిస్టినా ఆష్టన్ కన్నుమూత.. అందమే ప్రాణం తీసిందా?

బాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్ లాగా కనిపించే మోడల్ క్రిస్టినా ఆష్టన్ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. 34 సంవత్సరాల వయస్సులో ఆమె మరణించింది. కిమ్ కర్దాషియాన్ హాలీవుడ్ నటి. ఆమె అందానికి జనాలు పిచ్చెక్కిస్తున్నారు. ఆయనలా కనిపించాలని చాలా మంది ఆశపడుతుంటారు. మోడల్ క్రిస్టినాకు కూడా ఇదే కోరిక కలిగింది. అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేయడం ద్వారా కిమ్ వంటి ఆకృతిని, ముఖాన్ని పొందింది. శస్త్రచికిత్స తర్వాత, ఆమె సరిగ్గా కిమ్ లాగా కనిపించడం ప్రారంభించింది. దీంతో ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది.

ఇంటర్‌లో ఫెయిల్‌.. మనస్థాపంతో 9 మంది విద్యార్థులు బలవన్మరణం

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు రావడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈతవాకిలికి చెందిన అనూష(17) ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో నిన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సెలవుల కోసం కర్ణాటకలోని తన అమ్మమ్మ గ్రామానికి వెళ్లిన ఆమె అక్కడ ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిందని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన బాబు(17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గణితంలో ఫెయిల్ కావడంతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ లో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపం చెందిన అనకాపల్లికి చెందిన కారుబోతు తులసి కిరణ్ (17) నిన్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) పరీక్ష రాకపోవడంతో టెక్కలి వద్ద నిన్న తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం.. విచారణ జూన్ 5కి వాయిదా

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు పురోగతిపై జూన్ 5లోగా నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐతో దర్యాప్తు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్ 5కి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ స్టేటస్ రిపోర్టును ఈ ఏడాది జూన్ 5లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు పేర్కొంది. పేపర్ లీక్ కేసులో ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పరీక్షలు రాశారు. ఎంత మంది ఉద్యోగులు అనుమతి తీసుకుని పరీక్ష రాశారు. పరీక్ష రాసిన ఎంత మంది ఉద్యోగులను విచారించారని సిట్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఏ – 16 ప్రశాంత్ రోల్ ఎంటని ప్రశ్నించింది. దాక్యా నుండి డబ్బులు పెట్టీ పేపర్ కొన్న వాళ్ళు మళ్ళీ ఎవరికైనా అమ్మారా? అని ప్రశ్నించింది. కాగా.. ఈ కేసులో ఏ1 నిందితుడు అనుమతి తీసుకున్నట్లు సిట్ బృందం సభ్యుడు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు చాలా సున్నితమైనదని చెబుతూనే.. ఈ సమయంలో ఉత్తర్వులు జారీ చేస్తే.. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన విషయాలు బయటకు వస్తే కష్టమేనని హైకోర్టు అభిప్రాయపడింది. కాగా.. అదే రోజున ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

బాలికను బంధించి నలుగురు సామూహిక అత్యాచారం..

రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. నిత్యం మహిళలు, బాలికల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుండగా, మరోవైపు మహారాష్ట్రలోని కళ్యాణ్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ్ ఈస్ట్‌లో నివసిస్తున్న 15 ఏళ్ల మైనర్ బాలికను స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్తానని ఫోన్ చేసి వరుసగా రెండు రోజుల పాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కోల్‌సేవాడి పోలీస్ స్టేషన్ (పోలీస్ స్టేషన్)లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. నలుగురు హంతకులను పోలీసులు బంధించారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు.

బ్రిజ్‌ భూషణ్‌ సెల్ఫీ వీడియో.. ఆ రోజే వస్తా ప్రాణాలు వదిలేస్తా..

మహిళా రెజర్లు తనపై చేసిన ఆరోపణలపై జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌ సింగ్ స్పందించారు. తనలో శక్తి ఉన్నంతవరకు పోరాడతానంటూ ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. ఆ వీడియో తనపై వచ్చిన లైంగిక ఆరోపణల గురించి ప్రస్తావించకుండా తన నిస్సహాయతను ఎప్పటికీ అంగీకరించలేనని పేర్కొన్నాడు. మిత్రులారా అని సంభోధిస్తూ బ్రిజ్‌ భూషణ్ వీడియో సందేశాన్ని ఇచ్చారు. ” నేను జీవితంలో ఏం సాధించాను? ఏం కోల్పోయాను? అనే విషయాల గురించి ఆలోచించను. నేను గెలిచానా ఓడానా అని ఆత్మవిమర్శ చేసుకున్న రోజు.. తనలో పోరాడేందుకు సరిపడా శక్తి లేదని గ్రహించిన రోజు నేను నిస్సహాయుడనని భావిస్తా. అప్పుడు మరణాన్ని ఆశ్రయిస్తా.. ఎందకుంటే అలాంటి జీవితాన్ని నేను కోరుకోవడం లేదు” అని బ్రిజ్ భూషణ్ సెల్ఫీ వీడియోలో అన్నారు.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హజరయ్యే హక్కు చంద్రబాబుకు లేదు

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హజరయ్యే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఎన్టీఆర్ మరణనానికి కారణం కూడా చంద్రబాబే అని, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దే దించాడన్నారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ప్రసగంలో చంద్రబాబు ఔరంగజేబుతో పోల్చారని అంబటి రాంబాబు విమర్శించారు. నేను తురక గంగమ్మ కుటుంబానికి అన్యాయం చేసానని ఆరోపణలు చేశాడని, తురక అనిల్‌తో పాటు మరో ఇద్దరు చనిపోయారని,నా మీద కక్ష్య తప్ప, బాధితుల మీద ప్రేమలేదని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు బాధితుల మీద ప్రేమ ఉంటే ప్రమాదంలో చనిపోయిన మిగిలిన కుటుంబాలకు కూడా న్యాయం చేయాలన్నారు.

దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల్లో 7,533 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4.49 కోట్లకు పెరిగింది. 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,468కి పెరిగింది. యాక్టివ్ కోవిడ్ కేసులు 53,852కి తగ్గాయి. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.12 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఏపీ వాసులకు అలర్ట్‌.. నేడు, రేపు ఏపీకి వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుదిపేస్తున్నాయి. అయితే.. గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా ఏపీకి నేడు, రేపు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి ఉపరితల అవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల శుక్రవారం, శనివారం వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా, సీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఏపీ జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడే అవకాశముందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్లొద్దని తెలిపారు. రైతులు, కూలీలు, గొర్రెలకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.