NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది. సంక్రాంతి పండుగ వేళ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి.. ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా, నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు అరెస్టులు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు, పౌర సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్టీవీ జర్నలిస్టుల ఇళ్ల తలుపులు బద్దలుకొట్టి, ఇంటి లోపలికి వెళ్లి అరెస్టులు చేసినట్లు తెలుస్తుంది.
IND vs NZ: టీమిండియాదే బ్యాటింగ్.. ఆయుష్ బదోనికి షాక్, తెలుగు ఆటగాడికి ఛాన్స్!
ఇక, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాని ప్రభుత్వం పండుగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను రాజకీయ వికృత క్రీడల్లో బలిచేయడం దుర్మార్గమని అన్నారు. అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేయడానికి జర్నలిస్టులు ఏమైనా తీవ్రవాదులా..? అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రభుత్వం చేస్తున్న దాడి, తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై ప్రత్యక్ష దాడి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
బోల్డ్ డిజైన్, టెక్నాలజీ, హైబ్రిడ్ పవర్.. Renault Filante ప్రత్యేకతలు ఇవే..!
అలాగే, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సమంజసం కాదని, ముందుగా నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేదని సూచించారు. జర్నలిస్టుల అరెస్టులతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచిది కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
