Devara Trailer Telugu Date and Time: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘దేవర’ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర ట్రైలర్‌ని మంగళవారం (సెప్టెంబర్ 10) విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్‌కు టైంను ఫిక్స్ చేసింది. సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్‌ని వదులుతున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘గెట్ రెడీ ఫర్ గూస్‌బంప్స్’ అంటూ తారక్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం దేవర. రెండు భాగాలుగా వస్తోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పాటలను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్‌కు మూహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ చేతిలో పెద్ద కత్తి పట్టుకుని ఉన్నాడు.
Also Read: Smriti Mandhana: నా ఫేవరేట్ క్రికెటర్ అతడే: స్మృతి మంధాన
ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పకులు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.