Site icon NTV Telugu

JR.NTR : జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న అభిమానులు

Karnataka

Karnataka

JR.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అభిమానులతో పాటు నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. మహిళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని చూసి అబ్బురపడుతున్నారు. వీటిన్నంటికి కారణమైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కర్ణాటక రాజ్యోత్సవ’ వేడుకలకు హాజరైన ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా అయిపోయారు. వర్షం పడి కుర్చీలు తడిచిపోతే స్వయంగా వాటిని తుడిచి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత తన కుర్చీని కూడా తుడుచుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కర్ణాటక రాజోత్సవ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

Read Also: Munugode Bypoll: సమరానికి సర్వం సిద్ధం.. భారీగా భద్రతా బలగాల ఏర్పాటు

వర్షం పడడంతో ఆ సభలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు తడిచిపోయాయి. గమనించిన ఎన్టీఆర్ ఓ కుర్చీని బట్టతో తుడిచి పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోమని చెప్పారు. అనంతరం తన కుర్చీని కూడా తానే క్లీన్ చేసుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ కు మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చూసి ప్రశంసిస్తున్నారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని నిన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, ఎన్టీఆర్‌లు పునీత్ భార్య అశ్వినికి అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్నడలో చేసిన ప్రసంగం అభిమానులతో కేరింతలు కొట్టించింది.

Exit mobile version