JR.NTR : జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JR.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఇప్పుడు అభిమానులతో పాటు నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. మహిళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని చూసి అబ్బురపడుతున్నారు. వీటిన్నంటికి కారణమైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కర్ణాటక రాజ్యోత్సవ’ వేడుకలకు హాజరైన ఎన్టీఆర్ సింప్లిసిటీకి కన్నడ అభిమానులు ఫిదా అయిపోయారు. వర్షం పడి కుర్చీలు తడిచిపోతే స్వయంగా వాటిని తుడిచి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత తన కుర్చీని కూడా తుడుచుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ కర్ణాటక రాజోత్సవ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
Read Also: Munugode Bypoll: సమరానికి సర్వం సిద్ధం.. భారీగా భద్రతా బలగాల ఏర్పాటు
Also Read
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
వర్షం పడడంతో ఆ సభలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు తడిచిపోయాయి. గమనించిన ఎన్టీఆర్ ఓ కుర్చీని బట్టతో తుడిచి పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినిని కూర్చోబెట్టారు. ఆ తర్వాత మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధామూర్తిని కూర్చోమని చెప్పారు. అనంతరం తన కుర్చీని కూడా తానే క్లీన్ చేసుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ కు మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చూసి ప్రశంసిస్తున్నారు. కాగా, పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని నిన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రజనీకాంత్, ఎన్టీఆర్‌లు పునీత్ భార్య అశ్వినికి అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కన్నడలో చేసిన ప్రసంగం అభిమానులతో కేరింతలు కొట్టించింది.
The style icon…
With Simplicity….#NTR30#KarnatakaRathna#jrntr #NTRForAppu#ಕನ್ನಡರಾಜ್ಯೋತ್ಸವ #ಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #ಕರ್ನಾಟಕ_ರತ್ನ pic.twitter.com/JCfSGvvP77— Mahesh Herur (@MaheshHerur1) November 1, 2022
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!