NTV Telugu Site icon

NTR : మరి గ్లోబల్ హీరో అంటే ఆ మాత్రం ఉండదా.. పిల్లల భవిష్యత్ అప్పుడే అలా ప్లాన్ చేసిన ఎన్టీఆర్

Ntr (4)

Ntr (4)

NTR : గ్లోబల్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన ఎంత పెద్ద హీరో అయినా కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే, వీలైనంత ఎక్కువ సమయం తన కుటుంబంతో గడపడానికే చూస్తారు. గ్యాప్ దొరికినప్పుడల్లా భార్యా పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్స్ వేస్తుంటారు. సినీ ఈవెంట్లకు కూడా తీసుకొస్తుంటారు. అయితే సినిమా ఇంటర్వ్యూలలో తారక్ పెద్దగా తన ఫ్యామిలీ విషయాలను చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఇటీవల పలు సందర్భాల్లో తన ఇద్దరు పిల్లల గురించి మాట్లాడారు. తన తండ్రి తనను ఎలా పెంచేవారో అలానే తన పిల్లలను కూడా పెంచుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల రిలీజై భారీ సక్సెస్ అందుకున్న ‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన కుమారులు అభయ్‌ రామ్, భార్గవ్‌ రామ్ గురించి ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాళ్లిద్దరి ఆలోచనా విధానంలో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. పిల్లలని సినీ ఇండస్ట్రీలో తీసుకువస్తారా? అని ప్రశ్నించగా.. నా అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలను వారిపై రుద్దడం నచ్చదు. నేను అలా చేయను. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వారి సొంత ఆలోచనలు కలిగి ఉండారని నేను నమ్ముతాను. వాళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారో వారే నిర్ణయించుకునే వాతావరణాన్ని మాత్రం మనం కల్పించాలి. మనకి నచ్చింది చేయమని చెప్పడం కరెక్ట్ కాదు అని తారక్ అన్నారు.

“సినిమాల్లోకి రమ్మని, యాక్టింగ్‌ కెరీర్ ను ఎంచుకోమని నేను వాళ్లను బలవంతం చెయ్యను. ఎందుకంటే నా పేరెంట్స్ నన్ను ఆ విధంగా ట్రీట్‌ చేయలేదు. ఏదో సాధించాలనుకుంటున్నాడు.. చేయనివ్వు అనుకున్నారు. అదే విధంగా నేనూ నా పిల్లల అభిప్రాయాలను గౌరవించాలనుకుంటున్నాను. నా ప్రొఫెషన్ ఏంటనేది నా పిల్లలకు తెలుసు. తండ్రిని హీరోగా చూసినప్పుడు అదే దారిలో అడుగులు వేయాలని పిల్లలు కూడా అనుకుంటారు. ఇది సహజంగానే జరుగుతుంది” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తే ఆయన కుమారులిద్దరూ తన తండ్రి మాదిరిగా సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే, RRR చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా ‘దేవర 1’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ దగ్గర రూ. 470 కోట్లకు పైగా రాబట్టింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ‘దేవర 2’ రాబోతుంది. అంతకంటే ముందు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అలానే బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్నారు.

Read Also:India vs New Zealand: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఇదే..

Read Also:Suriya: వామ్మో సూర్య ఇదేం స్పీడు.. మరీ డిసెంబర్ నుంచేనా ?

Show comments