Site icon NTV Telugu

NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

Ntr Dragon

Ntr Dragon

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రను అత్యంత సహజంగా, పవర్‌ఫుల్‌గా చూపించేందుకు తారక్ కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం కేరళకు చెందిన అత్యంత ప్రాచీన యుద్ధ కళ ‘కలరిపయట్టు’ (Kalaripayattu) లో ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. దాదాపు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ యుద్ధ విద్యలో కర్రలు, కత్తుల వాడకంతో పాటు అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ అవసరం. ఎన్టీఆర్ ఇప్పటికే మంచి డ్యాన్సర్ కావడంతో, ఈ విద్యను చాలా వేగంగా నేర్చుకుంటున్నారని, సినిమాలో ఆయన చేసే ఫైట్ సీక్వెన్స్ లు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Also Read : Renu Desai :ఆ బూతులు ఆపండి.. అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ వీడియో వైరల్!

ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన ‘కేజీఎఫ్’, ‘సలార్’ తరహాలోనే ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్‌కు అదిరిపోయే ఎలివేషన్స్ ప్లాన్ చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్, విలక్షణ నటుడు బిమల్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్‌ను డైలాగ్ డెలివరీని ఈ సినిమా కోసం పూర్తిగా మార్చేస్తున్నారని, ముఖ్యంగా కలరిపయట్టు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీన్లు ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version