Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ప్రశాంత్ నీల్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తన కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా నిలబెట్టాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం ఆయన స్క్రిప్ట్ పనులకే చాలా సమయం కేటాయించారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నింటికంటే ‘డ్రాగన్’ విజువల్స్, మేకింగ్ పరంగా బెస్ట్ సినిమా అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక అదిరిపోయే ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో తారక్‌తో కలిసి స్టెప్పులు వేయడానికి ఒక టాప్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పాన్-ఇండియన్ అడ్వెంచర్ ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!