Site icon NTV Telugu

WAR 2 : ఎన్టీఆర్, హృతిక్ ‘వార్’ 2 ఫస్ట్ రివ్యూ..

War2 Review

War2 Review

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బిగ్గెస్ట్ యక్షన్ చిత్రం వార్ 2. బాలీవుడ్ గ్రీడ్ గాడ్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పొడుగు కాళ్ళ సుందరి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also Read :  Exclusive : వార్ 2.. ఎండ్ కార్డ్స్ లో ఊహించని సర్ప్రైజ్.. గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా

కాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దుబాయ్ నుండి సినిమాల రివ్యూలు అందించే ఉమైర్ సంధు వార్ 2 రివ్యూ వెల్లడించాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు యాక్షన్ హీరోలైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. వారిద్దరి అద్భుతమైన నటన ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తుంది. అలాగే వారిద్దరిపై చిత్రీకరించబడిన యాక్షన్  సీక్వెన్స్ గూస్ బమ్స్ తెప్పిస్తాయి. ఎన్టీఆర్, హ్రితిక్ అద్భుతమైన డాన్స్  సినిమాకు మేజర్ ప్లస్ కాబోతున్నాయి. ఆడియెన్స్ ను సర్పైజ్ చేసేందుకు భారీగా ప్లాన్ చేసారు మేకర్స్. ఇద్దరి హీరోలు ఒకరినొకరు పోటీపడి నటించారు. ఇవి సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. హీరోయిన్ కియారా అద్వానీ  కేవలం అందాల ఆరబోత కోసం మాత్రమే ఉంది తప్ప అంత ఇంపార్టెంన్స్ లేని రోల్ అని చెప్పాడు. వార్ 2 బాలీవుడ్ లెక్కలు మార్చబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ హిందీ అరంగేట్రం అద్భుతంగా ఉండబోతుంది. ఎన్టీఆర్ క్రేజీ మాచో అవతార్ ని ఇష్టపడతారు. ఓవరాల్ గా వార్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది అని ట్వీట్ చేసాడు.

Exit mobile version