NTV Telugu Site icon

War 2 : భారీ సెట్లో ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో మాస్ సాంగ్..

New Project (54)

New Project (54)

War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఫస్ట్ వీకెండ్‌లో 304 కోట్లు రాబట్టిన దేవర పార్ట్ 1.. మొదటి వారం పూర్తయ్యేసరికి 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది. దసరా హాలీడేస్‌ ఉండడం.. పెద్ద సినిమాలేవి థియేటర్లో లేకపోవడంతో దేవరకు తిరుగులేకుండా పోయింది. ఇక ఓ వైపు థియేటర్లో దేవర దండయాత్ర జరుగుతుంటే.. మరోవైపు ఎన్టీఆర్ యుద్ధానికి రెడీ అవుతున్నాడు. దేవర తర్వాత టైగర్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ వార్ 2. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా.. ఎన్టీఆర్‌ కీలక షెడ్యూల్స్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ పై పలు కీలక యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు.

Read Also:Narhari Zirwal: భవనంపై నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!

అయితే.. అంతకంటే ముందు ఎన్టీఆర్‌, హృతిక్ కాంబోలో ఒక మాస్ సాంగ్‌ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ సెట్‌ కూడా వేసినట్టుగా సమాచారం. ఈ పాట కోసం అక్టోబర్‌ మూడో వారంలో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడట. ఈ పాటకు వైభవి మర్చంట్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారట. సినిమాకే ఈ సాంగ్ హైలెట్‌గా నిలవనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ హీరోల టాప్ డ్యాన్సర్స్ లిస్ట్ తీస్తే.. ఎన్టీఆర్, హృతిక్ టాప్‌లో ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి మాస్ సాంగ్‌ అంటే.. థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. వచ్చే ఏడాది ఆగష్టులో వార్2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్‌ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.

Read Also:Vishwambhara : రెండు పాటలు తప్పా మిగతా అంతా కంప్లీట్.. విశ్వంభర లేటెస్ట్ అప్డేట్

Show comments