Site icon NTV Telugu

NTR: దేవర-2 ఖచ్చితంగా ఉంటుంది

Ntr

Ntr

NTR: టాలీవుడ్‌లో ఎన్టీఆర్ అంటే యాక్షన్, ఎనర్జీ, ఎమోషన్ కలబోసిన నటనకు మారుపేరు. బాలీవుడ్ స్థాయిలో కూడా తన సినిమాలతో మార్కెట్ పెంచుకున్న తారక్, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా.., ‘దేవర 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇకపోతే తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌కు అతిథిగా హాజరై, తన సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చి అభిమానులను ఉత్సాహపరిచాడు.

2025 మార్చి 28న విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ సూపర్ హిట్ టాక్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, 2023లో వచ్చిన ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ రచన, దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించగా.. సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహరించారు. తొలి రోజే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది. ఈ విజయం నేపథ్యంలో చిత్రయూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. ‘దేవర 2’ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

దేవర చిత్రాన్ని ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా ఆదరిస్తున్నారో చూస్తున్నాను. ఇది పూర్తిగా మీరందరూ భుజాల మీద మోసిన సినిమా. చాలా మంది దేవర 2 ఉండదని అనుకుంటున్నారు.. కానీ నేను స్పష్టంగా చెబుతున్నాను.. దేవర 2 ఖచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకుముందు ‘దేవర’ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టిన ఎన్టీఆర్, మధ్యలో ఒక గ్యాప్ తీసుకున్నారని.. కానీ, దేవర 2 కన్ఫర్మ్ అని చెప్పటంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎన్టీఆర్ స్పీచ్‌తో ఆడిటోరియం మారుమోగిపోయింది.

ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ కొత్త లుక్‌లో వచ్చాడు. బీర్డ్, స్టైలిష్ హెయిర్‌స్టైల్‌తో కొత్తగా మెరిసిన తారక్‌ను చూసిన అభిమానులు “డ్రాగన్ లుక్” అంటూ రచ్చ చేశారు. తారక్ నవ్వుతూ, సరదాగా ఫిల్మ్ యూనిట్‌తో ముచ్చటించడం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. మొత్తంగా ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్‌లో ‘దేవర 2’ అప్డేట్‌తో ఎన్టీఆర్ షో దద్దరిల్లిపోయింది. అభిమానులకు తారక్ ఇచ్చిన హామీ.. సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఇప్పుడు అందరి దృష్టి ‘దేవర 2’ అధికారిక అనౌన్స్‌మెంట్‌పై ఉంది.

Exit mobile version