NTR – Prashanth Neel : ‘డ్రాగన్’ స్టోరీని తెస్తున్న ఎన్టీఆర్-నీల్.. చైనాను గట్టిగానే టార్గెట్ చేసినట్టున్నారుగా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR – Prashanth Neel : కేజీఎఫ్ సిరీస్ తో భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తన ప్రయోగాలను కాసుల తుఫానుగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరాక అతడి రేంజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ 1 తీశారు. సలార్1 బాక్సాఫీస్ వద్ద సుమారు 700కోట్లు వసూలు చేసింది. దీంతో సలార్ 2పైనా భారీ అంచానాలే ఉన్నాయి. ఈ సమయంలో ప్రశాంత్ నీల్ ఇద్దరు అగ్ర హీరోల కోసం ఒకేసారి రెండు సినిమాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడని, నెక్ట్స్ లెవల్ స్క్రిప్టులను రెడీ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తు్న్నాయి. ప్రభాస్ తో సలార్ 2 చేయాల్సి ఉండగా, ఇదే సమయంలో ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కోసం నీల్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నాడు. యష్, ప్రభాస్ లతో భారీ ప్రయోగం చేసినట్టే ఇప్పుడు ఎన్టీఆర్ తోను అతడు ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సినిమాని ఇప్పటికే అధికారికంగా లాంచ్ చేసినందున ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తారక్ తో అతడు చేయబోయే ప్రయోగం ఎలా ఉండబోతుందన్న ఆరాలు మొదలయ్యాయి.
Read Also:AlluArjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్..
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా కథకు బంగ్లాదేశ్ కు, డ్రాగన్ దేశం చైనాతోను కనెక్షన్ ఉంటుందని సమాచారం. బంగ్లాదేశ్ లో సమస్యలు ఎదుర్కొనే తెలుగువారిని రక్షించే `డ్రాగన్` స్టోరీని అతడు తెరపైకి తెస్తున్నాడు. డ్రాగన్ ఎన్టీఆర్ పాత్రను మరో లెవల్లో ఎలివేట్ చేయబోతోంది. ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్లి పోరాడే తెలుగు వాడు డ్రాగన్. బంగ్లాదేశ్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు రక్షకుడిగా జూనియర్ ఎన్టీఆర్ పాత్రను చిత్రీకరిస్తూ, వలసదారుల చుట్టూ ఈ చిత్రం కథాంశం నడుస్తుందని రివీలైంది. ఈ చిత్రం పౌరాణిక డ్రామాతో నడవకపోయినా… ఫిక్షనలైజ్డ్ హిస్టారికల్ పాత్రలతో రక్తి కట్టించనున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ అనేది చైనా సంస్కృతిలో ఒక భాగం. అందువల్ల అక్కడి ప్రేక్షకులకు నచ్చే టైటిల్ ఇది అని కూడా విశ్లేషిస్తున్నారు.
Read Also:ViduthalaiPart2 : ఫస్ట్ పార్ట్ హిట్.. భారీ నష్టాలను మిగిల్చుతున్న విడుదల 2
- Tags
- #war2
- Devara
- ntr
- prabhas
- Prashanthneel
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!