Site icon NTV Telugu

NTR Centenary Award: జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం

Jayaprada

Jayaprada

NTR Centenary Award: నందమూరి బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఏడాది అంతటా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తెనాలిలో ఈనెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాజర్ పేట ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది. ప్రముఖ డైలాగ్ రైటర్ డాక్టర్ సాయి మాధవ్ బుర్ర సభా నిర్వహణలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార గ్రహీత ప్రఖ్యాత నటి జయప్రదకు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా పురస్కారాన్ని అందించబోతున్నారు. ఈ కార్యక్రమానికి జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా, సుప్రసిద్ధ సినీ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు. వీరు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ అభిమాన సత్కార గ్రహీత డాక్టర్ మైధిలి అబ్బరాజు, మాజీమంత్రి నెట్టెం రఘురాం కూడా పాల్గొననున్నారు.

Big Breaking: కమల్ హాసన్ హెల్త్ బులిటెన్ విడుదల..

ఈ శతజయంతి ఉత్సవాలలో భాగంగా తెనాలి పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ నటించిన సినిమాలను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం (28/11/2022) ‘అడవి రాముడు’ సినిమాను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనకు జయప్రద, నందమూరి రామకృష్ణ, ఏ. కోదండరామిరెడ్డి హాజరై ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించనున్నారు.

Exit mobile version