Site icon NTV Telugu

NTR Jayanthi: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ నివాళి!

Ntr 102 Jayanthi

Ntr 102 Jayanthi

నేడు నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) 102వ జయంతి. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నందమూరి హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్ ఒకే కారులో వచ్చి తాత సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే ‘ఒకే ఒక్కడు’!

నందమూరి మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వచ్చి నివాళులర్పించనున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మే 28న ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని పేర్కొంటూ జీవో జారీ చేసింది.

Exit mobile version