NTV Telugu Site icon

IRCTC: ఇకపై గంటలోపే మీ అకౌంట్లోకి రిఫండ్స్‌ డబ్బులు..!

Irctc

Irctc

మామూలుగా మనం రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో ఐఆర్​సీటీసీ నుండి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఒక్కోసారి టికెట్ బుక్కు కాకపోయినా మన అకౌంట్ నుండి డబ్బులు మాత్రం కట్ అయితాయి. అలా డబ్బులు కట్ అయిన కానీ.. టికెట్ మాత్రం బుక్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్​సీటీసీ మన డబ్బుల్ని రిఫండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఇందుకోసం మూడు లేక నాలుగు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే., ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఐఆర్​సీటీసీ ముందడుగు వేసింది.

Read also: Off The Record: తమ్మినేని సీటుకి వైసీపీ రెబల్స్ ఎసరు పెట్టారా..?

ఈ సమస్యకు మరికొద్ది రోజుల్లోనే రిఫండ్ అమౌంట్ ప్రక్రియను వేగవంతం చేయబోతుంది ఐఆర్​సీటీసీ. దీంతో రిఫండ్ నగదు కేవలం గంటలోపే ఎక్కడినుండి డబ్బులు కట్ అయ్యయ్యో.. తిరిగి అదే అకౌంట్లోకి చేరుతాయి. ఇందుకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిఫండ్ల విషయం గురించి ఎప్పటికప్పుడు ఐఆర్​సీటీసీ యూజర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది.

Read also:TSPSC: ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్..

రిఫండ్ల విషయంలో తీసుకుంటున్న సమయాన్ని పూర్తిగా తగ్గించాలని రైల్వే బోర్డు సంబంధిత విభాగాలకు ఈ సంవత్సరం జనవరిలోనే ఆదేశించింది. ఈ క్రమంలోనే ఐఆర్‌సీటీసీ, ఆ సంస్థకు ఐటీ సేవలందించే సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ప్రస్తుతం దీనిపై తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియలో బ్యాంకులు, పేమెంట్‌ గేట్‌ వేలు లాంటివి ఉండడంతో 3 లేదా 4 పనిదినాలు పడుతోంది. ఇక డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వినియోగించిన సందర్భాల్లో ఒక్కఓసారి పరిస్థితి వారం కూడా పడుతోంది. ఇలాంటి పరిస్థితులు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నపుడు అలాగే టికెట్టు క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది. దింతో ఐఆర్‌సీటీసీ రిఫండ్ల జారీ గడువు పై మరింత దృష్టి సారించింది.