Site icon NTV Telugu

Novak Djokovic : రికార్డు సృష్టించిన జొకోవిచ్

Novak Djokovic

Novak Djokovic

సెర్బియా టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ అరుదైన రికార్డు సృష్టించాడు. 1973 నుంచి కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు (378) ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు జొకోవిచ్. స్టెఫీ గ్రాఫ్ 377 వారాల రికార్డును జొకోవిచ్ బ్రేక్ చేశాడు. మార్టినా (332), సెరెనా(319), ఫెడరర్(310) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన అతడు.. 2011లో తొలిసారి వరల్డ్ నంబర్ వన్ అయ్యాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్‌లో 6,980 పాయింట్లతో తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు జొకోవిచ్‌.

Also Read : HCA: ఎన్టీఆర్ ని పిలిచాము కానీ రాలేదు – హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

దీంతో ఈ సెర్బియా స్టార్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ హోదాలో 378 వారాలు పూర్తి చేసుకోవడం ఖాయమైంది. అయితే.. ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్‌ స్టెఫీ గ్రాఫ్‌ పేరిట ఉండగా.. దాన్ని ఇప్పుడు జొకోవిచ్‌ బ్రేక్‌ చేశాడు. గ్రాఫ్‌ 377 వారాలు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచింది.

Also Read : T20 cricket: పొట్టి క్రికెట్‌లో మరీ ఇంత చెత్త రికార్డా..?

పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా 2021 మార్చిలోనే గుర్తింపు పొందాడు జొకోవిచ్‌. స్విట్జర్లాండ్‌ మేటి రోజర్‌ ఫెడరర్‌ (310 వారాలు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ గతంలోనే బద్దలు కొట్టాడు. అయితే ఇప్పుడు.. అటు పురుషుల విభాగంలోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్‌ చరిత్రను లిఖించాడు.

Exit mobile version