NTV Telugu Site icon

Nothing phone 2a Price: ‘నథింగ్‌ ఫోన్‌ 2ఏ’ స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్.. భారత కస్టమర్ల కోసమే!

Nothing Phone 2a Blue

Nothing Phone 2a Blue

Nothing phone 2a blue edition Launch and Price: ఎట్టకేలకు ‘నథింగ్‌ ఫోన్‌ 2ఏ’ స్పెషల్‌ ఎడిషన్‌ భారత్‌లో విడుదలైంది. భారత కస్టమర్ల కోసమే కంపెనీ సోమవారం (ఏప్రిల్ 29) ప్రత్యేక ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌ విక్రయాలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఓసారి పరిశీలిద్దాం.

ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌ 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా ఉంది. 8జీబీ+256జీబీ ధర రూ.25,999 కాగా.. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.27,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక సిటీ బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం రాయితీ వస్తుంది. నేవీ బ్లూ రంగులో ఈ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. నథింగ్‌ ఫోన్‌ 2ఏలో నలుపు, తెలుపు రంగుల ఎడిషన్లు గత నెలలోనే విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read: T20 World Cup 24: నేడు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సమావేశం.. ఎవరా 15 మంది!

నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌ 6.7 ఇంచెస్ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. 120 రీఫ్రెష్‌ రేటు, 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉంటాయి. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,200 ప్రో ప్రాసెసర్‌తో ఇది రన్ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ 2.5 ఓఎస్‌తో పనిచేస్తుంది. 50ఎంపీ మెయిన్‌, 50ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా సెటప్‌ను ఇందులో ఇచ్చారు. సెల్ఫీల కోసం 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 45వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ స్పెషల్‌ ఎడిషన్‌లో ఉంటుంది.

Show comments