NTV Telugu Site icon

Nota in Second Place: ఉపఎన్నికల్లో విచిత్రం.. నోటాదే రెండో స్థానం

Nota

Nota

Nota in Second Place: మహారాష్ట్ర ముంబయిలోని అంధేరి ఈస్ట్‌కు జరిగిన ఉపఎన్నికలో ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఉద్ధవ్ థాకరేకు చెందిన శివసేన అభ్యర్థి రమేశ్ లట్కే భార్య రుతుజ లట్కే విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటా నిలిచింది. మొత్తం 86,570 ఓట్లలో రుతుజకు 66,530 ఓట్లు రాగా, నోటాకు ఏకంగా 12,806 ఓట్లు పడ్డాయి. అంటే 14.79 శాతం ఓట్లు పోలయ్యాయి. బరిలో ఉన్న మిగతా వారిలో ఎవరికీ 1600కు మించి ఓట్లు రాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రాలో శివసేన రెండుగా చీలిపోయింది. ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి రుతుజ బరిలో నిలవగా బీజేపీ, ఏక్‌నాథ్ షిండే వర్గం తమ అభ్యర్థిని ఆ తర్వాత ఉప సంహరించుకుంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూడా రుతుజకే మద్దతు ఇవ్వడంతో పోటీ ఏకపక్షం అయింది. కాగా, ఉద్ధవ్ థాకరే శివసేనకు ఎన్నికల కమిషన్ ‘కాగడా’ గుర్తు కేటాయించింది. ఆ గుర్తుతో బరిలోకి దిగిన రుతుజ లట్కే ఘన విజయం సాధించింది.

Elon Musk: అమెరికా రాజకీయాలపై ట్వీట్‌ చేసిన మస్క్‌.. ఏమన్నారంటే?

మహారాష్ట్ర విధానసభలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియలో 31.74 శాతం ఓటింగ్ జరిగింది. 19 రౌండ్ల తర్వాత రుతుజా లట్కే అత్యధిక మెజారిటీ 66,530 ఓట్లతో గెలిచారు. అయితే ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ 12,806 మంది నోటా బటన్‌ను నొక్కడం గమనార్హం. అంధేరి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి వెళ్లగా… విపక్ష నేతలు విరమించుకోవాలని కోరడంతో బీజేపీ అభ్యర్థిని వెనక్కి తీసుకుని ఈ ఎన్నికకు పోటీ లేకుండా చేసింది.