NTV Telugu Site icon

Nigeria : మసీదులో బాంబు పేలుడు, 8 మంది మృతి, 16 మందికి గాయాలు

Blast

Blast

Nigeria : ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో స్థానికంగా తయారైన పేలుడు పదార్థాలతో ఒక మసీదుపై ఒక వ్యక్తి దాడి చేశాడు. ఫలితంగా అగ్ని ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది భక్తులు మరణించారు.. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు ప్రతినిధి అబ్దుల్లాహి హరునా మాట్లాడుతూ.. అనుమానితుడు(38) స్థానిక నివాసి, కానో మారుమూల గడాన్ గ్రామంలోని మసీదుపై దాడి చేసినట్లు అంగీకరించాడు. ఇందుకు కారణంగా చాలా కాలాంగా కుటుంబ విభేదాల వల్ల కక్ష పెంచుకుని దాడి చేసినట్లు తెలిపాడు.

Read Also:West Bengal: బెంగాల్‌లో పిడుగుపాటు.. 12 మంది మృతి

గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆసుపత్రిలో మరణించారని హరునా స్థానిక ఛానల్ టెలివిజన్‌కు గురువారం చెప్పారు. గాయపడిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఉత్తర నైజీరియాలోని అతిపెద్ద రాష్ట్రమైన కానోలో భయాందోళనలకు దారితీసింది. ఇక్కడ మతపరమైన అశాంతి సంవత్సరాలుగా సంభవిస్తుంది.. అది ఇలా కొన్నిసార్లు హింసకు దారితీసింది.

Read Also:Off The Record: కాంగ్రెస్‌ను కలవరపెడుతున్న పోలింగ్ తరువాత లెక్కలు..!

అనుమానితుడు స్థానికంగా తయారు చేసిన బాంబుతో మసీదుపై దాడి చేశాడని స్థానిక పోలీసు చీఫ్ ఒమర్ సాండా విలేకరులతో అన్నారు. దీనికి ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదు. స్థానిక టీవీ స్టేషన్ ప్రసారం చేసిన ఫుటేజీలో ముస్లిం మెజారిటీ కానో రాష్ట్రంలోని గడాన్ గ్రామంలోని ప్రధాన ప్రార్థనా స్థలం అయిన మసీదు వద్ద కాలిపోయిన గోడలు, ఫర్నిచర్ కనిపించాయి. భక్తులను మసీదు లోపల బంధించారని, వారు తప్పించుకోవడం కష్టమని స్థానిక మీడియా పేర్కొంది. కొందరు చిన్నారులు నిప్పులు చూసి భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారని నివాసి హుస్సేని అదాము తెలిపారు. వాటికి చల్లార్చడానికి నీరుపోశామన్నాడు. గాయపడిన వారిని రాష్ట్ర రాజధానిలోని ఆసుపత్రికి తరలించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.