Site icon NTV Telugu

North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!

North Korea Unga Speech

North Korea Unga Speech

North Korea: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 80వ సెషన్ సక్సెస్‌పుల్‌గా ముగిసింది. ఈ సమావేశంలో చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు వివిధ దేశాల నాయకులు ప్రసంగించారు. నాలుగు ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తర కొరియా ఈ సమావేశంలో పాల్గొంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ వేదిక నుంచే.. ఆ దేశం అణు కార్యక్రమాన్ని ఇప్పుడు తమ సార్వభౌమాధికారంలో భాగమని ప్రత్యక్షంగా ప్రకటించింది. ఎన్ని ఆంక్షలు విధించినా, ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి కిమ్ సన్ గ్యో నొక్కి చెప్పారు.

READ ALSO: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

అమెరికాకు గట్టి దెబ్బ..
నార్త్ కొరియా ఉప విదేశాంగ మంత్రి కిమ్ సన్ గ్యో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ.. అణ్వాయుధాలను వదిలివేయాలని డిమాండ్ చేయడం తమ దేశ గుర్తింపు, రాజ్యాంగాన్ని తొలగించడంతో సమానమని పేర్కొన్నారు. నిరాయుధీకరణకు ఏవైనా షరతులు ఉంటే అది లొంగిపోవడమే అవుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ పదేపదే ఉత్తర కొరియా అణ్వాయుధీకరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా ప్రకటన అమెరికాపై ప్రత్యక్ష దాడి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిమ్ జోంగ్ ఉన్ తన అణ్వాయుధ ఆయుధశాల ఇకపై ఎప్పటికీ బేరసారాల చిప్‌గా ఉండదని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, అణ్వాయుధ నిరాయుధీకరణ, ఆంక్షల ఎత్తివేతపై మాత్రం ఇరుదేశాల ఒప్పందం విఫలమైంది. ఉత్తర కొరియా తన ప్రసంగంలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను పెరుగుతున్న దురాక్రమణ ముప్పుగా విమర్శించింది. అందుకే కొరియా ద్వీపకల్పంలో అధికార సమతుల్యతను కొనసాగించడానికి అణ్వాయుధాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

దక్షిణ కొరియా స్పందన..
దక్షిణ కొరియా ప్రకారం.. ఉత్తర కొరియా ప్రస్తుతం నాలుగు యురేనియం సుసంపన్న కేంద్రాలను నిర్వహిస్తోంది. వాటిలో ప్రసిద్ధ యోంగ్‌బియోన్ కేంద్రం కూడా ఉంది. ఈ కేంద్రాల్లోని సెంట్రిఫ్యూజ్‌లు ప్రతిరోజూ పనిచేస్తున్నాయని అది పేర్కొంది. అందుకే దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ప్యోంగ్యాంగ్ అణు విస్తరణను ప్రాంతీయ ముప్పుగా భావిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా మాత్రమే కాదు ప్రపంచంలోని తొమ్మిది అణ్వాయుధ సంపన్న దేశాలైన అమెరికా, రష్యా, చైనా, భారత్, పాక్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలు తమ అణ్వాయుధాలను వేగంగా ఆధునీకరిస్తున్నాయని పేర్కొన్నాయి.

READ ALSO: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Exit mobile version