Site icon NTV Telugu

North Korea: జ‌పాన్ స‌ముద్రంలోకి నార్త్ కొరియా క్షిపణి

North Koria

North Koria

ఇవాళ ఉత్తర కొరియా ఇంట‌ర్మీడియ‌ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిప‌ణిని పరీక్షించింది. జ‌పాన్ స‌ముద్ర జ‌లాల దిశ‌గా ఆ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు పేర్కొనింది. ఆ క్షిప‌ణి ప్రొజెక్టైల్ స‌ముద్ర జ‌లాల్లో ప‌డిన‌ట్లు జ‌పాన్ దేశ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఉత్తర కొరియా పశ్చిమ తీరం నుంచి దాన్ని ప‌రీక్షించిన‌ట్లు సమాచారం. విమానాల‌కు కానీ నౌక‌ల‌కు కానీ ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని జపాన్ సర్కార్ వర్గాలు చెప్పుకొచ్చాయి.

Read Also: Mumbai Indians: ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు ‘అతడు’ కావాలి: గవాస్కర్

కాగా, ఈ ఏడాది బాలిస్టిక్ క్షిప‌ణిని నార్త్ కొరియా మూడ‌వ‌ సారి ప‌రీక్షించింది. ఆ క్షిప‌ణికి హైప‌ర్‌సోనిక్ వార్‌ హెడ్‌ను అమ‌ర్చిన‌ట్లు ద‌క్షిణ కొరియా మిలిట‌రీ అధికారులు తెలిపారు. సుమారు 600 కిలో మీట‌ర్ల దూరం ఆ క్షిప‌ణి ప్రయాణించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జ‌పాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా ఈ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు. ఉత్తర కొరియా ఈ ఏడాది చాలా సార్లు బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను పరీక్షించిందని.. దీంతో ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఉందన్నారు. దీన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆమోదించ‌బోమ‌ని ప్రధాని కిషిదా అన్నారు.

Exit mobile version