గత ఏడు దశాబ్దాలుగా ఉభయ కొరియా దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. అమెరికాతో దక్షిణ కొరియా దోస్తీ చేస్తుండటం.. ఉత్తర కొరియాకు మరింత కంటగింపుగా మారింది. అగ్రరాజ్యంతో జత కలిసి సౌత్ కొరియాపై కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తరచూ క్షిపణి, రాకెట్ ప్రయోగాలతో ఆ దేశంపై కవ్వింపులకు పాల్పడుతున్నారు. తాజాగా, పొరుగుదేశంపై మరోసారి ప్రతీకార చర్యలకు కిమ్ జోంగ్ దిగారు. కానీ, ఈసారి క్షిపణులు, బాంబులతో మాత్రం కాదు. బెలూన్లతో తమ దేశంలోని చెత్తను దక్షిణ కొరియాలో జారవిడిచి ప్రతీకారం తీర్చుకున్నారు.
Read Also:
Tank Bund Traffic: ఆదివారం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు ట్యాంక్‌బండ్ బంద్..
కాగా, దక్షిణ కొరియాపై ముందస్తు దాడి చేసే సత్తా తమకుందని చెప్పేందుకే అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో యుద్ధ విన్యాసాలు చేసింది. నార్త్ కొరియా గతంలోనూ అనేక విన్యాసాలు చేసింది కానీ, ఇటీవల గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం ఫెయిల్ కావడంతో కిమ్ చూస్తుండగానే కనీసం 18 రాకెట్లతో దక్షిణ కొరియాపై చెత్త జారవిడిచింది. దీంతో పాటు సౌత్ కొరియా సరిహద్దుల్లో లౌడ్‌స్పీకర్ల ద్వారా ఉత్తర కొరియా ప్రజలకు సందేశాలు వినిపించే ఛాన్స్ కూడా ఉంది.
Read Also: Water Crisis : దేశంలోని 150 రిజర్వాయర్లలో మిగిలింది… కేవలం 23 శాతం కంటే తక్కువ నీరేనట
ఇక, కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఉత్తర కొరియా ప్రజల మానవ హక్కులను ఎలా కాలరాస్తోందో తెలుపుతూ నినాదాలు, ప్రసంగాలను వినిపించే అవకాశం కూడా ఉంది. ఉత్తర కొరియన్లకు విదేశీ రేడియో, టీవీ ప్రసారాలు అందవు కాబట్టి లౌడ్ స్పీకర్లే శరణ్యంగా మారింది. ఇలాంటి చిల్లర పనులను తక్షణమే బంద్ చేయాలని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. తమ సహనాన్ని పరీక్షించాలని చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొకోవాల్సి వస్తుందని సౌత్ కొరియా వెల్లడించింది.
