Site icon NTV Telugu

North Korea : ఉత్తర కొరియాలోని అరాచకాలు వెలుగులోకి..

Kim Jang Un

Kim Jang Un

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమంటున్నాయి. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ బల్లగుద్ది మరీ చెబుతుంది.
అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా విడుదల చేసింది.

Also Read : Pawan Kalyan: ఏప్రిల్ 5 నుంచి ‘భగత్ సింగ్’గా మారనున్న పవర్ స్టార్

అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షణ కొరియా 2017 నుంచి 2020 మధ్యలో తమ మాతృభూమిని వదిలి వచ్చిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది.

Also Read : Today Business Headlines 31-03-23: నీతా అంబానీ కల్చరల్ సెంటర్. నేడే ప్రారంభం. మరిన్ని వార్తలు

నర్సుల చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి.. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్ లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించిన ఏదైనా ఆన్ లైన్ లో షేర్ చేసినా.. అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజీన్ చూస్తు.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపినట్లు పేర్కొంది.

Also Read : Rishabh Pant : మళ్లీ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..

మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టానుసారంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ.. అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ మంత్రిత్వశాఖ సమర్పించింది.

Exit mobile version