Nominations In Telugu States LIVE UPDATES: సార్వత్రిక ఎన్నికలు 2024కు కీలక అంకం మొదలైంది. నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లన స్వీకరణ ప్రారంభమైంది. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి మొదలైంది. గురువారం ఉదయం ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికల సందడి మరింత ఊపందుకోనుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నాలుగోదశ నోటిఫికేషన్‌లో ఏపీ, తెలంగాణ, బీహార్, ఝూర్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఏపీ బీహార్‌లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. వీటికి 25వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
-
నామినేషన్ వేసిన బుట్టా రేణుకా
ఎమ్మిగనూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్ దాఖలు చేశారు.. వైసీపీ ఆఫీస్ నుండి కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన ఆమె.. తహశీల్దార్ ఆఫీస్ లో నామినేషన్ పత్రాలను సమర్పించారు.. ఎమ్మిగనూరులో జగన్ నవరత్నాలతో విజయం సాధిస్తా.. నాపై ఎవరెన్ని ఆరోపణలు చేసినా నేను వ్యక్తిగత ఆరోపణలు చేయను అన్నారు బుట్టా రేణుకా
-
పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుంది: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. పలమనేరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా వెంకటయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.నామినేషన్ అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీ కోసం భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి.
పలమనేరు నియోజకవర్గంలో వైసీపీ జెండా మరోసారి ఎగురుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మన అభ్యర్ధిపై విమర్శలు చేశారని.. విమర్శలు ఎదుర్కొన్న వెంకటేశ్ గౌడ్ 33 వేల ఓట్లతో గెలుపొందారన్నారు. అప్పటికీ వైసీపీ ప్రభుత్వం లేదని, అయినా భారీ మెజారిటీతో గెలిచామన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్ని అభివృద్ధి పనులు చేసి, ఇన్ని సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఈ నేపథ్యంలో మనం గతం కంటే రెంటింపు మెజారిటీతో గెలవాలని పార్టీ నేతలకు సూచించారు. కనీసం 66 వేల ఓట్ల మెజారిటీతో ఈసారి పలమనేరులో విజయం సాధించాలన్నారు.
-
నాగర్ కర్నూల్ లో బీజేపి నుంచి భారత్ ప్రసాద్ నామినేషన్
నాగర్ కర్నూల్ జిల్లా (12 ఎస్సీ) నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపి నుంచి అభ్యర్థి భారత్ ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈకార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మేల్యే వెంకట రమణ రెడ్డి, బీజేపి నాయకులు పాల్గొన్నారు.
-
నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి నామినేషన్
నాగర్ కర్నూల్ జిల్లా (12 ఎస్సీ) నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి మల్లు రవి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మేల్యేలు రాజేష్ రెడ్డి, వంశీ కృష్ణా, MLC దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
-
నిజామాబాద్ పార్లమెంటు కు తొలి నామినేషన్ దాఖలు
నిజామాబాద్ పార్లమెంటు కు తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ సత్యనారాయణ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. కొన్నేళ్లుగా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్ కోసం ఉద్యమం చేస్తున్న సత్యనారాయణ. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సత్యనారాయణ తన నామినేషన్ దాఖలు చేశారు.
-
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఎంపి అభ్యర్థి డీకే అరుణ
మహబూబ్ నగర్ లో నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఎంపి అభ్యర్థి డీకే అరుణ
-
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నీలం మధు తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఆవుల రాజిరెడ్డి నామినేషన్ వేశారు.
-
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ నామినేషన్
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మొదటి సెట్ నామినేషన్ వేశారు. సురేష్ షెట్కార్ తరపున కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేశారు. ఈ నెల 24న సురేష్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
-
మిధున్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలు చేసిన తల్లి
అన్నమయ్య జిల్లా : కలెక్టరేట్‌లో రాజంపేట వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి తరపున వెంకట మిథున్ రెడ్డి తల్లి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత మొదటి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
-
నామినేషన్ దాఖలు చేసిన సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడను గత పాలకులు పూర్తిగా విస్మరించారని సుజనా చౌదరి విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి లేదన్నారు. తనను గెలిపిస్తే పశ్చిమ నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. స్మశాన వాటికతో పాటు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపడతామన్నారు. రోడ్లను వేస్తామని, ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.
-
స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి నామినేషన్
శ్రీకాకుళం జిల్లా: ఆమదాలవలస నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి నామినేషన్‌ను లోలుగు వెంకట రాజశేఖర్ దాఖలు చేశారు.
-
నామినేషన్ సమర్పించిన మాగుంట శ్రీనివాసులరెడ్డి
ప్రకాశం : ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలసి వచ్చి కలెక్టర్ దినేష్ కుమార్‌కు మొదటి సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. సాదాసీదాగా ఇవాళ నామినేషన్ వేయగా.. ఈనెల 25న ర్యాలీతో రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
-
నామినేషన్ వేసిన బస్తీపాటి నాగరాజు, బొగ్గుల దస్తగిరి
కర్నూలు:
కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తీపాటి నాగరాజు, కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి నామినేషన్ దాఖలు చేశారు.
-
నామినేషన్ దాఖలు చేసిన శిల్ప చక్రపాణిరెడ్డి
నంద్యాల జిల్లా: ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్ప చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు.
-
ఏపీలో తొలి నామినేషన్ పయ్యావుల కేశవ్
అమరావతి: ఏపీలో తొలి నామినేషన్ పయ్యావుల కేశవ్.. 11-05 నిమిషాలకు నామినేషన్ వేసిన పయ్యావుల.. ఇప్పటి వరకు మూడు నామినేషన్లు దాఖలైనట్టు వెబ్ సైటులో పెట్టిన ఈసీఐ.
-
తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు
తూర్పుగోదావరి జిల్లా : కొవ్వూరులో ఆర్డీఓ కార్యాలయంలో 10 వేలమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీతో తరలివచ్చి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు.
-
నల్లగట్ల స్వామిదాస్ నామినేషన్ దాఖలు
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు నల్లగట్ల స్వామిదాస్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంఛార్జ్ పూనూరు గౌతమ్ పాల్గొన్నారు.
-
నామినేషన్ దాఖలు చేసిన కిలివేటి సంజీవయ్య
తిరుపతి జిల్లా: సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డిలు హాజరయ్యారు.
-
నామినేషన్ దాఖలు చేసిన బడ్డు అప్పలనాయుడు.
విజయనగరం జిల్లా: నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బడ్డు అప్పలనాయుడు.
-
అనంత వెంకట్రామిరెడ్డి తరపున నామినేషన్ దాఖలు
అనంతపురం అర్బన్ వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకట్రామిరెడ్డి తరపున నామినేషన్ దాఖలు చేసిన ఆయన సోదరుడు అనంత సుబ్బారెడ్డి.
-
కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి నామినేషన్
కడప : కడప పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా దేవగుడి భూపేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
-
రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు
తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో రాజమండ్రి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
-
కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నెల్లూరు జిల్లాలోని కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ వేసి తిరిగి వస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు ఎదురుగా వచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు నేతలు కార్యకర్తలతో ప్రశాంతి రెడ్డి తరలివచ్చారు. జై జగన్ అంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలు చేయగా.. జగన్ పోవాలి.. సైకిల్ రావాలి అంటూ టీడీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలు శాంతించాయి.
-
శెట్టిపల్లి రఘురామి రెడ్డి నామినేషన్ దాఖలు
కడప : మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శెట్టిపల్లి రఘురామి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
-
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు
నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావులు వెళ్లారు.
-
భారీ ర్యాలీతో ఆదినారాయణ రెడ్డి నామినేషన్
కడప జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలో భారీ ర్యాలీతో కదిలి వెళ్లి నామినేషన్ వేశారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఆదినారాయణ రెడ్డి.
-
తాడిపత్రిలో తండ్రి తరఫున తనయుడు నామినేషన్ దాఖలు
అనంతపురం : తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపున ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి.
-
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్ .
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ ఆఫీస్ నుండి కొత్త మునిసిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి.. తహశీల్దార్ ఆఫీస్‌లో నామినేషన్ వేశారు బుట్టా రేణుక. ఎమ్మిగనూరులో జగన్ నవరత్నాలతో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తనపై ఎవరెన్ని ఆరోపణలు చేసిన తాను వ్యక్తిగత ఆరోపణలు చేయనని బుట్టా రేణుక స్పష్టం చేశారు.
-
మెదక్ లోక్ సభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు
మెదక్ లోక్ సభ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మొదటి సెట్ నామినేషన్ వేశారు. సాయంత్రం గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ర్యాలీ రఘునందన్ రావు నిర్వహించనున్నారు.
-
మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న ఈటెల
మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థిగా నేడు ఈటెల రాజేందర్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు ముఖ్య నేతలు, కార్యకర్తలతో సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పురి పాల్గొన్నారు.
-
భర్త తరఫున నామినేషన్ దాఖలు చేసిన పయ్యావుల హేమలత
అనంతపురం జిల్లా : ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరపున ఒక్క సెట్ నామినేషన్ దాఖలు చేసిన పయ్యావుల కేశవ్ భార్య హేమలత.
-
నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ రెడ్డి
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ రెడ్డి
-
నామినేషన్ వేసిన వెంకటయ్య గౌడ్, విజయనందా రెడ్డి
చిత్తూరు జిల్లా: పలమనేరు ఆర్డీవో ఆఫీస్‌లో నామినేషన్ వేసిన వెంకటయ్య గౌడ్.
చిత్తూరు: చిత్తూరు కలెక్టరేట్‌లో నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి విజయనందా రెడ్డి
-
నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్ది బోజ్జల సుధీర్ రెడ్డి, నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌లు స్దానిక ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
-
నామినేషన్ దాఖలు చేసిన కొరముట్ల శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు.
-
వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం మొదలైంది. వైసీపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్‌కు 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు ప్రసన్నకుమార్ రెడ్డి. హంగుహార్భాటాలు లేకుండా నామినేషన్ దాఖలు చేశారు.
